Danish Kaneria: ఉగ్రదాడులపై స్పందించరేం
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:37 AM
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా, కశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించి, ఉగ్రవాదులను వదిలిపెట్టమని పేర్కొన్నాడు.
పాక్ ప్రధానిపై కనేరియా విమర్శ కరాచీ: పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తమ దేశ ప్రధాని షెహబాజ్ షరీ ఫ్‌పై విరుచుకుపడ్డాడు. కశ్మీర్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడులపై కనీస స్పందన కరువైందని దుయ్యబట్టాడు. ‘పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం లేకుంటే.. ఇప్పటిదాకా ప్రధాని షెహబాజ్ ఎందుకు స్పందించనట్టు? ఎందుకు మీ సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది? ఎందుకంటే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చి పోషించేది మీరే కాబట్టి. సిగ్గుండాలి’ అంటూ ఎక్స్‌లో కనేరియా తీవ్రస్థాయిలో స్పందించాడు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించాడు. దాడులు చేసిన ఉగ్రవాదులను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదన్నాడు.
Updated Date - Apr 25 , 2025 | 03:37 AM