ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముమ్మర సాధన

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:29 AM

యువ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత్‌ కఠోరంగా శ్రమిస్తోంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల రిటైర్మెంట్‌తో ప్రస్తుతం జట్టులో అనుభవలేమి బాగా కనిపిస్తోంది. కానీ, కోచ్‌...

లండన్‌: యువ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత్‌ కఠోరంగా శ్రమిస్తోంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల రిటైర్మెంట్‌తో ప్రస్తుతం జట్టులో అనుభవలేమి బాగా కనిపిస్తోంది. కానీ, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వ్యూహాలు, సూచనలతో టీమిండియా సంచలనాలు నమోదు చేయాలనుకొంటోంది. కెప్టెన్‌గా గిల్‌కు కూడా ఇది తొలి సిరీస్‌ కావడంతో అతడిపై ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం బెకెన్‌హామ్‌ను బేస్‌గా చేసుకొన్న టీమిండియా ఈ నెల 20 నుంచి జరిగే సిరీ్‌స కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. భారత్‌-ఎ తరఫున చాలా మంది ఆటగాళ్లు ఈపాటికే ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు అనధికార టెస్టులు ఆడేశారు. శుక్రవారం భారత జట్ల మధ్యే మూడో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే, గంభీర్‌ మాత్రం ప్రతి విషయాన్ని సీరియ్‌సగా తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. జట్టుకు బ్యాటింగ్‌ సాధనలా కాకుండా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ప్రాక్టీస్‌ వికెట్లను రూపొందించాలని క్యూరేటర్లకు సూచించాడట. సహజంగా ఇంగ్లిష్‌ పిచ్‌లు స్వింగ్‌కు ఎక్కువగా సహకరిస్తాయి. ఈ నేపథ్యంలో భారత కోచింగ్‌ సిబ్బంది మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం చక్కని వికెట్‌ కావాలని కోరినట్టు క్యూరేటర్‌ జోష్‌ మార్డెన్‌ తెలిపాడు. అందుకు అనుగుణంగా వికెట్‌ను రూపొందించినట్టు చెప్పాడు.

క్యాచింగ్‌.. త్రోయింగ్‌

టెస్ట్‌ సిరీస్‌ కోసం టీమిండియా తీవ్రంగా సాధన చేస్తోంది. గిల్‌ అండ్‌ కో ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను బీసీసీఐ నెట్‌లో షేర్‌ చేసింది. ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌.. ఆటగాళ్లతో క్యాచింగ్‌, త్రోయింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు. కాగా, సుదర్శన్‌ అద్భుత క్యాచ్‌ను గిల్‌ ప్రశంసించాడు.

శ్రేయాస్‌కు గంగూలీ మద్దతు

ఫామ్‌ ఆధారంగా శ్రేయాస్‌ అయ్యర్‌కు జట్టులో చోటు కల్పించి ఉండాల్సిందని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ ఎంతో ఉపయుక్తమైన ఆటగాడని చెప్పాడు. ఏడాదిగా పరుగుల వరద పారిస్తున్నా సెలెక్టర్లు అతడిని పట్టించుకోలేదని గంగూలీ అన్నాడు. ఈ సిరీ్‌సకు శ్రేయా్‌సను ఎంపిక చేసి ఉంటే.. అతడు జట్టు కోసం ఏం చేసేవాడో తెలిసేదని దాదా చెప్పాడు.


ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:29 AM