Asia Junior Badminton 2025: తన్వి వెన్నెలకు కాంస్యాలే
ABN, Publish Date - Jul 27 , 2025 | 01:56 AM
తెలుగు షట్లర్ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో...
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్
సోలో (ఇండోనేసియా): తెలుగు షట్లర్ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వెన్నెల 15-21, 18-21తో లూ సియా (చైనా) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీ్‌సలో రెండో సీడ్ తన్వీ శర్మ 13-21, 14-21తో ఎనిమిదో సీడ్ యిన్ యీ కింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, ఒకే టోర్నీలో ఇలా మహిళల సింగిల్స్‌లో రెండు పతకాలు లభించడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
Updated Date - Jul 27 , 2025 | 01:56 AM