రాణించిన తనుష్
ABN, Publish Date - Jun 10 , 2025 | 05:02 AM
తనుష్ కోటియన్ (90 నాటౌట్), అన్షుల్ కంబోజ్ (51 నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించడంతో ఇంగ్లండ్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టు డ్రాగా ముగిసింది...
ఇంగ్లండ్ ‘ఎ’తో మ్యాచ్ డ్రా
నార్తాంప్టన్: తనుష్ కోటియన్ (90 నాటౌట్), అన్షుల్ కంబోజ్ (51 నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించడంతో ఇంగ్లండ్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. సోమవారం చివరి రోజు భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను 92 ఓవర్లలో 417/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. నితీశ్ (42), శార్దూల్ (34) సహకరించారు. జార్జి హిల్‌కు మూడు.. వోక్స్, జాక్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇక చివరి సెషన్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 32/3 స్కోరు సాధించింది. అన్షుల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఫలితం తేలే అవకాశం లేకపోయేసరికి ముందుగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 348, ఇంగ్లండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేశాయి.
ఇవీ చదవండి:
ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి
లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 10 , 2025 | 05:02 AM