ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెమీస్ కు సబలెంక స్వియటెక్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:30 AM

మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియటెక్‌, టాప్‌సీడ్‌ సబలెంక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు....

జెంగ్‌, స్విటోలినా అవుట్‌ఫఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియటెక్‌, టాప్‌సీడ్‌ సబలెంక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. మంగళవారం ఇక్కడ జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్‌ స్వియటెక్‌ (పోలెండ్‌) 6-1, 7-5తో ఉక్రెయిన్‌ స్టార్‌, 13వ సీడ్‌ స్విటోలినాను చిత్తుచేసింది. కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టిన 24 ఏళ్ల స్వియటెక్‌కు ఈ వేదికపై వరుసగా ఇది 26వ విజయం. స్వియటెక్‌ తన కెరీర్‌లో నెగ్గిన మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్స్‌లో నాలుగు ఇక్కడే అందుకోవడం విశేషం. క్లేకోర్టులో తిరుగులేని ఆటతీరుతో అదరగొడుతున్న స్వియటెక్‌ గురువారం జరిగే సెమీఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ సబలెంకతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో సబలెంక (బెలారస్‌) 7-6 (3), 6-3తో చైనాకు చెందిన 8వ సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో 8వ సీడ్‌ లోరెంజొ ముసెట్టి (ఇటలీ) 6-2, 4-6, 7-5, 6-2తో అమెరికాకు చెందిన 15వ సీడ్‌ ఫ్రాన్సెస్‌ టియాఫోపై గెలిచి సెమీఫైనల్‌కు చేరాడు.

ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 04:30 AM