పౌలినీకి స్విటోలినా షాక్
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:43 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియటెక్, టాప్ సీడ్ సబలెంక క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అయితే, గతేడాది రన్నరప్ జాస్మిన్ పౌలీనికి 13వ సీడ్ స్విటోలినా షాకిచ్చింది...
క్వార్టర్స్‌కు స్వియటెక్, సబలెంక, అల్కారజ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియటెక్, టాప్ సీడ్ సబలెంక క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అయితే, గతేడాది రన్నరప్ జాస్మిన్ పౌలీనికి 13వ సీడ్ స్విటోలినా షాకిచ్చింది. మ్యాచ్ పాయింట్ నుంచి మలుపుతిప్పిన ఉక్రెయిన్ భామ స్విటోలినా 4-6, 7-6(6), 6-1తో నాలుగో సీడ్ పౌలినీపై అద్భుత విజయంతో ముందంజ వేసి క్వార్టర్స్ చేరింది. మరో ప్రీక్వార్టర్స్‌లో స్వియటెక్ 1-6, 6-3, 7-5తో 13వ సీడ్ రిబకినాపై నెగ్గింది. సబలెంక 7-5, 6-3తో 16వ సీడ్ అనిసిమోవాపై, 8వ సీడ్ క్విన్‌వెన్ జాంగ్ 7-6(5), 1-6, 6-3తో సమ్‌సనోవాపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కారజ్ 7-6(8), 6-3, 4-6, 6-4తో 13వ సీడ్ బెన్ షెల్టన్‌పై, 12వ సీడ్ టామీ పాల్ 6-3, 6-3, 6-3తో అలెక్సీ పాపిరన్‌పై గెలిచి క్వార్టర్స్‌లో ప్రవేశించారు.
బోపన్న, యుకీ అవుట్: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు. బోపన్న-ఆడమ్ జంట 2-6, 6-7(5)తో హెన్రీ-హ్యారీ ద్వయం చేతిలో, యుకీ-రాబర్ట్ జో డీ 4-6, 4-6తో ఇవాన్-క్రిస్టియన్ ద్వయం చేతిలో ఓడారు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 03:43 AM