ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నరైన్‌ తిప్పేశాడు

ABN, Publish Date - Apr 30 , 2025 | 05:27 AM

వరుస విజయాలతో జోరు చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట తడబడుతోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని కోల్పోగా.. అటు చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుత...

నేటి మ్యాచ్‌

చెన్నై X పంజాబ్‌

వేదిక : చెన్నై, రా.7.30 నుంచి

  • ఆల్‌రౌండ్‌షోతో అదుర్స్‌

  • ఢిల్లీపై కోల్‌కతా విజయం

  • రేసులోనే నైట్‌రైడర్స్‌

  • పోరాడిన డుప్లెసి, అక్షర్‌

న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరు చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట తడబడుతోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని కోల్పోగా.. అటు చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుత ప్రదర్శన కనబర్చింది. డుప్లెసి (62), అక్షర్‌ (43)ల పోరాటంతో గెలుపు దిశగా సాగుతున్న ఢిల్లీని స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (3/29) తన మ్యాజిక్‌ బంతులతో వెనక్కి లాగాడు. దీంతో 14 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌ నెగ్గింది. 9 పాయింట్లతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగానే ఉంచుకుంది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. రఘువంశీ (44), రింకూ సింగ్‌ (36), నరైన్‌ (27) రాణించారు. స్టార్క్‌కు 3.. అక్షర్‌, విప్రజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడింది. చివర్లో విప్రజ్‌ నిగమ్‌ (38) ఆకట్టుకున్నాడు. వరుణ్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నరైన్‌ నిలిచాడు.


స్పిన్నర్ల హవా: భారీ ఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే ఝలక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ పోరెల్‌ (4)ను స్పిన్నర్‌ అనుకూల్‌ అవుట్‌ చేయగా, కాసేపటికే కరుణ్‌ నాయర్‌ (15), కేఎల్‌ రాహుల్‌ (7) వెనుదిరగడంతో ఢిల్లీ 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే డుప్లెసి ఒంటరి పోరాటానికి కెప్టెన్‌ అక్షర్‌ సహకారం తోడవ్వడంతో రన్‌రేట్‌ పదికి తగ్గకుండా సాగింది. తొమ్మిదో ఓవర్‌లో డుప్లెసి 4,4,6తో 16 రన్స్‌ అందించాడు. 13వ ఓవర్‌లో స్కోరు 130కి చేరింది. ఈ దశలో జట్టు గెలుపు ఖాయమనిపించినా నరైన్‌ గట్టి దెబ్బతీశాడు. 14వ ఓవర్‌లో అతడు అక్షర్‌ను అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. దీనికి తోడు ఆరో బంతికి హిట్టర్‌ స్టబ్స్‌ (1)ను బౌల్డ్‌ చేయడంతో ఢిల్లీ షాక్‌కు గురైంది. ఇక 31 బంతుల్లో ఫిఫ్టీతో జోరు మీదున్న డుప్లెసిని తన తర్వాతి ఓవర్‌లోనే నరైన్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ కోలల్‌తా వైపు తిరిగింది. పైగా 18వ ఓవర్‌లో అశుతోష్‌ (7), స్టార్క్‌ (0)లను స్పిన్నర్‌ వరుణ్‌ అవుట్‌ చేయడంతో ఫలితం తేలిపోయింది. చివర్లో విప్రజ్‌ వేగంగా ఆడడం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.


చివర్లో తడబడ్డారు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ టాప్‌గేర్‌లో సాగినా.. చివర్లో అదుపు తప్పింది. ఆఖరి ఐదు ఓవర్లలో 45 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయిన జట్టు కష్టంగా 200 దాటింది. రఘువంశీ, రింకూ సింగ్‌ మాత్రం ఎదురుదాడికి ప్రయత్నించి ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్లు నరైన్‌, గుర్బాజ్‌ (26) అదిరే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్‌లో గుర్బాజ్‌ రెండు ఫోర్లు సాధించగా.. రెండో ఓవర్‌లో నరైన్‌ 6,4,6,4తో 25 పరుగులు రాబట్టాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే గుర్బాజ్‌ 4,4,6తో ధాటిని చూపి ఆరో బంతికి వెనుదిరిగాడు. అయినా తొలి వికెట్‌కు 18 బంతుల్లోనే 48 పరుగులు సమకూరాయి. ఆ వెంటనే కెప్టెన్‌ రహానె (26) బౌండరీల జోరుతో పవర్‌ప్లేలో జట్టు 79/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాత వరుస ఓవర్లలో నరైన్‌, రహానె వికెట్లు కోల్పోవడంతో స్కోరు 91/4కి చేరింది. కానీ రఘువంశీ రెండు సిక్సర్లతో తొమ్మిదో ఓవర్‌లో స్కోరు వందకి చేరుకుంది. వెంకటేశ్‌ అయ్యర్‌ (7) విఫలం కాగా స్పిన్నర్లు కుల్దీప్‌, అక్షర్‌ పరుగులను నియంత్రించారు. ఈ దశలో 15వ ఓవర్‌లో రింకూ 4,6,4తో 17 రన్స్‌ రాబట్టడంతో కాస్త కోలుకుంది. వీరి ధాటికి స్కోరు 220కి చేరుతుందనిపించింది. అయితే ఢిల్లీ బౌలర్లు ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో తడబాటు ఆరంభమైంది. ఆఖరి ఓవర్‌లో తొమ్మిది పరుగులకే కేకేఆర్‌ మూడు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి రస్సెల్‌ సిక్సర్‌తో స్కోరు 200 దాటినా.. ఆ తర్వాత స్టార్క్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా రస్సెల్‌ (17) రనౌటయ్యాడు.


స్కోరుబోర్డు

కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) పోరెల్‌ (బి) స్టార్క్‌ 26, నరైన్‌ (ఎల్బీ) విప్రజ్‌ 27, రహానె (ఎల్బీ) అక్షర్‌ 26, రఘువంశీ (సి) నాయర్‌ (బి) చమీర 44, వెంకటేశ్‌ (సి) విప్రజ్‌ (బి) అక్షర్‌ 7, రింకూ (సి) స్టార్క్‌ (బి) విప్రజ్‌ 36, రస్సెల్‌ (రనౌట్‌) 17, పావెల్‌ (ఎల్బీ) స్టార్క్‌ 5, అనుకూల్‌ (సి) చమీర (బి) స్టార్క్‌ 0, హర్షిత్‌ (నాటౌట్‌) 0, వరుణ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 204/9; వికెట్ల పతనం: 1-48, 2-85, 3-91, 4-113, 5-174, 6-177, 7-203, 8-203, 9-203; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-43-3, చమీర 3-0-46-1, ముకేశ్‌ 2-0-17-0, విప్రజ్‌ 4-0-41-2, అక్షర్‌ 4-0-27-2, కుల్దీప్‌ 3-0-27-0.

ఢిల్లీ: అభిషేక్‌ పోరెల్‌ (సి) రస్సెల్‌ (బి) అనుకూల్‌ 4, డుప్లెసి (సి) రింకూ (బి) నరైన్‌ 62, కరుణ్‌ నాయర్‌ (ఎల్బీ) వైభవ్‌ అరోరా 15, కేఎల్‌ రాహుల్‌ (రనౌట్‌) 7, అక్షర్‌ (సి) హర్షిత్‌ (బి) నరైన్‌ 43, స్టబ్స్‌ (బి) నరైన్‌ 1, విప్రజ్‌ (బి) రస్సెల్‌ 38, అశుతోష్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 7, స్టార్క్‌ (సి) గుర్బాజ్‌ (బి) వరుణ్‌ 0, చమీర (నాటౌట్‌) 2, కుల్దీప్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 190/9; వికెట్ల పతనం: 1-4, 2-43, 3-60, 4-136, 5-138, 6-146, 7-160, 8-160, 9-189; బౌలింగ్‌: అనుకూల్‌ 4-0-27-1, వైభవ్‌ 2-0-19-1, హర్షిత్‌ రాణా 4-0-49-0, వరుణ్‌ 4-0-39-2, నరైన్‌ 4-0-29-3, రస్సెల్‌ 2-0-22-1.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 10 7 3 0 14 0.521

ముంబై 10 6 4 0 12 0.889

గుజరాత్‌ 9 6 3 0 12 0.748

ఢిల్లీ 10 6 4 0 12 0.362

పంజాబ్‌ 9 5 3 1 11 0.177

లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325

కోల్‌కతా 10 4 5 1 9 0.271

రాజస్థాన్‌ 10 3 7 0 6 -0.349

హైదరాబాద్‌ 9 3 6 0 6 -1.103

చెన్నై 9 2 7 0 4 -1.302

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:27 AM