ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mitchell Starc IPL Exit: స్టార్క్‌ అవుట్‌

ABN, Publish Date - May 17 , 2025 | 01:57 AM

ఐపీఎల్‌లో ఢిల్లీకి శాక్‌ ఇచ్చిన స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ లీగ్‌కు దూరమవుతానని ప్రకటించాడు. అయితే పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు స్టొయినిస్‌, ఇంగ్లిస్‌ రాకతో ఉత్సాహం కనిపించింది.

స్టొయినిస్‌, ఇన్‌గ్లి‌స్ రాకతో పంజాబ్‌లో జోష్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాయిదా తర్వాత శనివారం పునఃప్రారంభమవుతున్న ఐపీఎల్‌కు తాను దూరమవుతున్నట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ప్రకటించాడు. భారత్‌-పాక్‌ యుద్ధం కారణంగా లీగ్‌ వారంపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ జట్టులోని ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు మాత్రం భారత్‌ వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అటు స్టార్క్‌ తన గైర్హాజరు విషయాన్ని ఢిల్లీ యాజమాన్యానికి తెలుపగా, వారు కూడా అతడి నిర్ణయాన్ని గౌరవించినట్టు సమాచారం. అయితే ఢిల్లీ వైస్‌ కెప్టెన్‌ డుప్లెసీ తన రాకను ధృవీకరించాడు. ఇక స్టబ్స్‌ లీగ్‌ మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం లండన్‌ వెళ్తాడు. ఇక, కేవలం ఒక్క మ్యాచ్‌ ఆడిన డొనోవాన్‌ ఫెరీరా కూడా జట్టుకు దూరమవుతున్నానని ప్రకటించాడు.

బెంగళూరు, పంజాబ్‌లకు ఊరట: టాప్‌-3లో కొనసాగుతున్న బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లకు కీలక ఆటగాళ్ల రాకతో ఊరట లభించింది. బెంగళూరు పేసర్‌ హాజెల్‌వుడ్‌ ప్లేఆ్‌ఫ్సకు అందుబాటులో ఉంటాడు. ఇక ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ఇన్‌గ్లి్‌సల రాకపై సందేహాలు వీడాయి. తాము భారత్‌కు రానున్నట్టు వెల్లడించడంతో పంజాబ్‌ శిబిరంలో సంతోషం నెలకొంది. ముంబై ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ కేవలం లీగ్‌ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రానున్నాడు.

Updated Date - May 17 , 2025 | 01:58 AM