ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లంక.. ఏడేళ్లలో తొలిసారి

ABN, Publish Date - May 05 , 2025 | 04:39 AM

ఆల్‌రౌండర్‌ నీలాక్షికా సిల్వా (33 బంతుల్లో 56) దూకుడైన బ్యాటింగ్‌తో ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలలో భారత్‌పై శ్రీలంక మహిళలు తొలి విజయం అందుకున్నారు...

  • భారత్‌పై గెలుపు

  • మహిళల ముక్కోణపు సిరీస్‌

కొలంబో: ఆల్‌రౌండర్‌ నీలాక్షికా సిల్వా (33 బంతుల్లో 56) దూకుడైన బ్యాటింగ్‌తో ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలలో భారత్‌పై శ్రీలంక మహిళలు తొలి విజయం అందుకున్నారు. ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3 వికెట్లతో హర్మన్‌ సేనను ఓడించింది. టోర్నీలో రెండో విజయం సాధించిన శ్రీలంక ఫైనల్‌కు చేరువైంది. ఇక సిరీ్‌సలో భారత్‌కిది తొలి పరాజయం. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినందున ఈ ఓటమి హర్మన్‌ సేన ఫైనల్‌ చేరికపై ప్రభావం చూపే అవకాశం లేదు. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 275/9 స్కోరు సాధించింది. కీపర్‌ రిచా ఘోష్‌ (48 బంతుల్లో 58) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. జెమీమా (37), ప్రతికా రావల్‌ (35) పర్లేదనిపించారు. అనంతరం శ్రీలంక 49.1 ఓవర్లలో 278/7 స్కోరు చేసి నెగ్గింది.


సంక్షిప్తస్కోర్లు: భారత్‌: 50 ఓవర్లలో 275/9 (రిచా 58, జెమీమా 37, ప్రతికా రావల్‌ 35, హర్మన్‌ 30, చమరి అటపట్ట 3/43, సుగందికా కుమారి 3/44). శ్రీలంక: 49.1 ఓవర్లలో 278/7 (నీలాక్షిక 56, హర్షిత 53, కవిష 35, స్నేహ్‌ రాణా 3/45).

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 04:39 AM