డ్రాగా ముగిసిన బంగ్లాతో లంక టెస్టు
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:04 AM
కుశాల్ మెండిస్ (12 నాటౌట్), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (12 నాటౌట్) అండతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ను శ్రీలంక డ్రా చేయగలిగింది. 296 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక...
గాలె: కుశాల్ మెండిస్ (12 నాటౌట్), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (12 నాటౌట్) అండతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ను శ్రీలంక డ్రా చేయగలిగింది. 296 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక.. స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (3/23) ధాటికి 48/4తో ఇక్కట్లలో పడింది. ఈ దశలో కుశాల్, ధనంజయ జాగ్రత్తగా ఆడి చివరి సెషన్‌లో 32 ఓవర్లపాటు బౌలర్లను నిలువరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 177/3తో శనివారం, చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 285/6 డిక్లేర్డ్ స్కోరుతో ప్రత్యర్థికి సవాలు విసిరింది. కెప్టెన్ షంటో (125 నాటౌట్) మ్యాచ్‌లో రెండో శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 495, లంక 485 రన్స్ చేశాయి.
మాథ్యూ్‌సకు వీడ్కోలు: ఈ టెస్ట్‌తో శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైరయ్యాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ వచ్చినప్పుడు బంగ్లా ఆటగాళ్లు అతడికి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చారు. ఈ మ్యాచ్‌తో టెస్ట్‌లకు వీడ్కోలు పలుకనున్నట్టు మాథ్యూస్ గత నెలలోనే ప్రకటించాడు. 119 టెస్ట్‌లు ఆడిన 38 ఏళ్ల మాథ్యూస్.. 8214 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలున్నాయి.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 05:04 AM