శ్రీలంక ఇన్నింగ్స్ విజయం
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:22 AM
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను ఆతిథ్య శ్రీలంక 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగియగా.. చివరిదైన కొలంబో టెస్టులో లంక...
రెండో టెస్టులో బంగ్లా ఓటమి
కెప్టెన్సీకి షంటో గుడ్‌బై
కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను ఆతిథ్య శ్రీలంక 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగియగా.. చివరిదైన కొలంబో టెస్టులో లంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో నెగ్గింది. 211 పరుగుల లోటుతో శనివారం నాలుగో రోజు 115/6 ఓవర్‌నైట్ స్కోరుతో బంగ్లా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే లెఫ్టామ్ స్పిన్నర్ ప్రబాత్ జయసూరియ 5 వికెట్లతో దెబ్బతీయడంతో బంగ్లా 133 పరుగులే చేసింది. అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 247, శ్రీలంక 458 రన్స్ సాధించింది. అటు బంగ్లా చిత్తుగా ఓడడంతో కెప్టెన్ నజ్ముల్ షంటో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. 2023లో బాధ్యతలు తీసుకున్న అతడి ఆధ్వర్యంలో బంగ్లా 14 టెస్టులు ఆడగా నాలుగింట్లో నెగ్గింది.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 03:22 AM