ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sports Stars Salute Indian Army: మేమంతా మీ వెంటే

ABN, Publish Date - May 10 , 2025 | 05:26 AM

దేశ రక్షణ కోసం పోరాడుతున్న త్రివిధ దళాలకు క్రీడా ప్రముఖుల మద్దతు వెల్లువైంది. విరాట్‌, రోహిత్‌, నీరజ్‌, సింధు సహా పలువురు జవాన్ల ధైర్యాన్ని ప్రశంసించారు.

  • త్రివిధ దళాలకు క్రీడాలోకం సెల్యూట్‌

న్యూఢిల్లీ: దేశం కోసం పోరాడుతున్న త్రివిధ దళాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పోరాట యోధులకు యావత్‌ క్రీడాలోకం సెల్యూట్‌ కొడుతోంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, నీరజ్‌ చోప్రా, పీవీ సింధు తదితరులు సైనికులను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

  • దేశ రక్షణ కోసం సైన్యం తీసుకొనే ఏనిర్ణయాన్నైనా స్వాగతిస్తా. దేశ గౌరవాన్ని నిలబెట్టడడం కోసం మన యోధులు ముందుండి పోరాడుతున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా మెలగాలి. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దు. జైహింద్‌.

    - రోహిత్‌ శర్మ

  • క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న భద్రతా దళాలకు నా సెల్యూట్‌. వారి త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.

- విరాట్‌ కోహ్లీ

  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం కోసం పోరాడుతున్న ఆర్మీని చూసి గర్విస్తున్నాం. మనవంతుగా వారి సూచనలు పాటిస్తూ.. అందరం సురక్షితంగా ఉందాం.

- నీరజ్‌ చోప్రా

  • మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగనిరతే మన దేశ ఆత్మ. మీ నిస్వార్థసేవను ఎప్పుడూ గుర్తు చేసుకొంటాం. దేశం మొత్తం మీవెనుకే. జైహింద్‌.

- పీవీ సింధు

  • యుద్ధాన్ని పాక్‌ కోరుకొంది. ఉగ్ర వనరులను కాపాడుకోవడానికి పాక్‌ ఉద్రిక్తతలు పెంచింది. వారి వాచాలత్వానికి మన బలగాలు ఎప్పటికీ మరచిపోలేని విధంగా గుణపాఠం చెప్పాయి.

- వీరేంద్ర సెహ్వాగ్‌

Updated Date - May 10 , 2025 | 05:28 AM