ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్జాతీయ క్రికెట్‌కు క్లాసెన్‌ గుడ్‌బై

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:15 AM

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (33) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. గతేడాది జనవరిలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పిన క్లాసెన్‌.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్టు...

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (33) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. గతేడాది జనవరిలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పిన క్లాసెన్‌.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్టు తెలిపాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ వ్యవహారాలను సమన్వయం చేసుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పాడు. ఏడేళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన క్లాసెన్‌.. వచ్చే నెలలో అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడనున్నాడు. ‘నా కెరీర్‌, కుటుంబ భవిష్యత్‌ కోసం ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకొన్నా. కఠిన నిర్ణయమే అయినా.. ప్రశాంతంగా ఉంద’ని క్లాసెన్‌ తెలిపాడు. ఏప్రిల్‌లో ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో క్లాసెన్‌ పేరు లేకపోవడంతోనే అతడు రిటైర్మెంట్‌పై ఊహాగానాలు చెలరేగాయి. 2018 ఫిబ్రవరిలో స్వదేశంలో భారత్‌తో సిరీ్‌సలో వన్డే, టీ20లు అరంగేట్రం చేసిన క్లాసెన్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పవర్‌ హిట్టర్‌గా ఎదిగాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:15 AM