ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లేఆఫ్స్‌కు సఫారీలు దూరం

ABN, Publish Date - May 16 , 2025 | 05:41 AM

రేపటి నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం కానుంది. అయితే మారిన షెడ్యూల్‌తో ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ముంబై, గుజరాత్‌, పంజాబ్‌, ఢిల్లీ, బెంగళూరు జట్లపై గట్టి దెబ్బే పడనుంది. ఎందుకంటే ఈ టీమ్స్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు...

బీసీసీఐ-సీఎ్‌సఏ మధ్య చర్చలు విఫలం

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పెద్దపీట

న్యూఢిల్లీ: రేపటి నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం కానుంది. అయితే మారిన షెడ్యూల్‌తో ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ముంబై, గుజరాత్‌, పంజాబ్‌, ఢిల్లీ, బెంగళూరు జట్లపై గట్టి దెబ్బే పడనుంది. ఎందుకంటే ఈ టీమ్స్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లీగ్‌ దశకే పరిమితమై ప్లేఆఫ్స్‌కు దూరం కాబోతున్నారు. భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం కారణంగా లీగ్‌ను ఈనెల 9న వాయిదా వేయగా తిరిగి 17 నుంచి ఆరంభించనున్న విషయం తెలిసిందే. అయితే జూన్‌ 11 నుంచి ఆసీస్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగుతుంది. ప్రస్తుతం లీగ్‌లో ఆడుతున్న సఫారీ ప్లేయర్లలో ఎనిమిది మందికి ఈ ఫైనల్‌ జట్టులోనూ చోటు లభించింది. అంతేకాకుండా వీరిలో ఏడుగురు ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న జట్లతోనే ఉండడం గమనార్హం. గతంలో అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మే 25 వరకు మాత్రమే క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఏస్‌ఏ) తమ ఆటగాళ్లకు ఎన్‌ఓసీ ఇచ్చింది. కానీ ఐపీఎల్‌ ఫైనల్‌ జూన్‌ 3కి మారడంతో ఇబ్బంది ఏర్పడింది. దీంతో వారి ఎన్‌ఓసీ పొడిగింపు కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేసినా సీఏస్‌ఏ తోసిపుచ్చింది. ఈ నెల 26 వరకల్లా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఆటగాళ్లు తిరిగి రావాలని సఫారీ జట్టు కోచ్‌ షుక్రి కాన్‌రాడ్‌ ఇదివరకే స్పష్టం చేశాడు. అయితే మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరోవైపు ఈ పరిణామాలు ముంబై ఇండియన్స్‌పై గట్టి ప్రభావం చూపనుంది. ఈ టీమ్‌లో కీలకంగా ఉన్న రికెల్టన్‌, బోష్‌ (దక్షిణాఫ్రికా)లతో పాటు ఇంగ్లండ్‌ ప్లేయర్‌ విల్‌ జాక్స్‌ కూడా విండీస్‌తో సిరీస్‌ కోసం వెళ్లనున్నాడు.


అలాగే హాజెల్‌వుడ్‌ గాయంతో దూరం కానున్నాడని వార్తలు వెలువడినా త్వరలోనే తను ఆర్‌సీబీతో కలువనున్నట్టు సమాచారం. కాగా, ఎన్‌గిడి, రూథర్‌ఫోర్డ్‌ (విండీస్‌) కూడా లీగ్‌ దశ అయ్యాక వెనుదిరగనున్నారు. ఇదిలావుండగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఉన్నప్పటికీ ఐపీఎల్‌లో ఆడే వెస్టిండీస్‌ ఆటగాళ్లు మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.

ఇవీ చదవండి:

పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌‌తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా

ఆర్సీబీకీ అదిరిపోయే న్యూస్

నీరజ్‌ ఇక లెఫ్టినెంట్‌ కల్నల్‌

ఏ ప్లస్‌ లోనే రోహిత్‌ విరాట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:41 AM