సరికొత్త అధ్యాయం
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:49 AM
ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్ లక్కీ’ అనే ట్యాగ్‌ను...
ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్ లక్కీ’ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న జట్టు దక్షిణాఫ్రికా. చోకర్స్ (కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టు)గా ముద్ర వేసుకొన్న సఫారీలు ఇప్పుడు చాంపియన్లుగా నిలిచారు.
దిగ్గజాల వల్ల కానిది..: ఏబీ డివిల్లీర్స్, గ్రేమ్ స్మిత్, గ్యారీ కిర్‌స్టెన్, అలెన్ డొనాల్డ్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టు కోసం ఎంతో శ్రమించారు. వీరందరి కృషితో జట్టు మెరుగుపడినా.. ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే అయింది. ఎట్టకేలకు మార్‌క్రమ్, బవుమా అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
ఓటములను దిగమింగుకొని..: నాకౌట్స్‌లో నిరాశ.. సఫారీలకు 1992 నుంచి వెంటాడుతోంది. ఆ వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్‌లో వరుణుడి రూపంలో షాక్ తగిలింది. 1999 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ టై కావడం అనేది ఎప్పటికీ గుండెల్లో ముల్లులాంటిదే. గతేడాది జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఏడాది తిరిగే సరికి ‘జూన్ 14’ను సువర్ణాక్షరాలతో లఖించదగ్గ రోజుగా మార్చుకొంది.
కెరీర్ చివర్లో ఉన్న రబాడ.. ఫైనల్ మ్యాచ్‌లో కంగారూల పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్ క్రమ్.. భారీ శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తితో సౌతాఫ్రికా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 15 , 2025 | 04:49 AM