ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంధాన 2

ABN, Publish Date - May 14 , 2025 | 04:22 AM

శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మహిళల స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మహిళల స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. మంగళవారం ప్రకటించిన తాజా మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో మంధాన (727 పాయింట్లు) ఓ స్థానం ఎగబాకి రెండో ర్యాంక్‌లో నిలిచింది. టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్‌ (738)కు కేవలం 11 పాయింట్ల దూరంలో ఉంది. మిగతా బ్యాటర్లలో జెమీమా ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఓ స్థానం కోల్పోయి 16లో ఉంది. బౌలింగ్‌ జాబితాలో సోఫీ ఎకెల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌) నెంబర్‌వన్‌గా కొనసాగుతుండగా.. భారత్‌ నుంచి దీప్తి శర్మ 4వ ర్యాంక్‌ నిలబెట్టుకుంది. ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ ఓ స్థానం మెరుగై 5వ ర్యాంకులో నిలవగా, ఆష్లే గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా) టాప్‌లో ఉంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:22 AM