ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెమీస్‌లో జొకోవిచ్‌ ఓటమి

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:38 AM

రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన ఆరో సీడ్‌ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. శుక్రవారం రాత్రి హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ జానిక్‌ సినర్‌ చేతిలో...

అల్కారజ్‌తో అమీతుమీ నేడు

సా.6.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన ఆరో సీడ్‌ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. శుక్రవారం రాత్రి హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ జానిక్‌ సినర్‌ చేతిలో జొకో 4-6, 5-7, 6-7 (3-7) తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. ఆద్యంతం దూకుడు కనబర్చిన సినర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. అలాగే ఓపెన్‌ ఎరాలో ఎడ్రియానో పనట్టా తర్వాత ఈ మెగా టోర్నీ తుదిపోరుకు చేరిన రెండో ఇటాలియన్‌గా సినర్‌ నిలిచాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ 39 ఏళ్ల జొకోపై సినర్‌దే ఆధిపత్యం. ఇక 3 గంటల 16 నిమిషాలపాటు సాగిన సెమీ్‌సలో సినర్‌ 10 ఏస్‌లతో చెలరేగాడు. అటు జొకో నాలుగు ఏస్‌లకే పరిమితమయ్యాడు. అయితే తొలి సెట్‌లో తేలిపోయినా చివరి రెండు సెట్లలో జొకో గట్టిగానే పోరాడాడు. కానీ తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన సినర్‌ పదునైన సర్వీస్‌ల ముందు నిలబడలేక చేతులెత్తేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కారజ్‌తో సినర్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.


జొకోకు ఇక్కడ

ఇదే ఆఖరు!

తనకు ఇదే చివరి ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటూ జొకోవిచ్‌ సంకేతాలిచ్చాడు. ‘ఇక్కడ నేను ఆడిన చివరి మ్యాచ్‌ ఇదే కావచ్చేమో. నాకైతే తెలీదు. మరో ఏడాది తర్వాత రోలాండ్‌ గారోస్‌లో ఆడేందుకు శరీరం సహకరిస్తుదో లేదో?. అందుకే ఆట పూర్తయ్యాక భావోద్వేగానికి లోనయ్యా’ అని మ్యాచ్‌ అనంతరం 38 ఏళ్ల జొకో అన్నాడు. అయితే, ఈ నెలాఖరులో మొదలయ్యే వింబుల్డన్‌, ఆగస్టులో జరిగే యూఎస్‌ ఓపెన్‌లో మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై బీసీసీఐ సీరియస్!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:43 AM