సింధు ప్రణయ్ ఆట గాడిలో పడేనా
ABN, Publish Date - May 20 , 2025 | 04:03 AM
సుదీర్ఘ కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్ మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనైనా పుంజుకోవాలని...
నేటినుంచి మలేసియా మాస్టర్స్
కౌలాలంపూర్: సుదీర్ఘ కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్ మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనైనా పుంజుకోవాలని పట్టుదలగా ఉన్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే టోర్నీలో జపాన్‌కు చెందిన నట్సుకి నిదైరాతో సింధు తొలి రౌండ్‌లో తలపడనుంది. ప్రణయ్‌కు మొదటి రౌండ్‌లోనే ఐదో సీడ్, కెంటా నిషిమోటో (జపాన్) రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురు కానున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోడ్, ఉన్నతి హుడా, ఆకర్షీ కశ్యప్, పురుషుల సింగిల్స్‌లో సతీష్ కరుణాకరన్, ప్రియాన్షు రజావత్ బరిలో నిలిచారు. మిక్స్‌డ్‌లో ధ్రువ్ కపిల/తనీష, రోహన్/రుత్వికా శివానీ, పురుషుల డబుల్స్‌లో హరిహరన్/రూబన్ తలపడుతున్నారు. ప్రపంచ మాజీ నెం.1 కిడాంబి శ్రీకాంత్, తరుణ్ క్వాలిఫయింగ్ రౌండ్ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 20 , 2025 | 04:03 AM