ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asia Cup Squad Announcement: అయ్యర్‌ ఆడేది ఖాయమే

ABN, Publish Date - Aug 08 , 2025 | 03:13 AM

ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీ్‌సతో ఆకట్టుకున్న టీమిండియా ఇప్పుడిక ఆసియాక్‌పపై దృష్టి సారించనుంది. అయితే ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగనుండడంతో జట్టు సభ్యులు కూడా మారనున్నారు. అనేక ప్రతికూల...

కీపర్‌గా సంజూ శాంసన్‌

ఆసియాక్‌పలో భారత జట్టుపై అంచనాలు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీ్‌సతో ఆకట్టుకున్న టీమిండియా ఇప్పుడిక ఆసియాక్‌పపై దృష్టి సారించనుంది. అయితే ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగనుండడంతో జట్టు సభ్యులు కూడా మారనున్నారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈలో ఈ టోర్నీ జరిగేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అదే నెల 14న ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించే భారత్‌-పాక్‌ పోరు కూడా జరుగుతుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో దుబాయ్‌, అబుధాబి వేదికలుగా మొత్తం 19 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మరోవైపు ఆసియాక్‌పలో పాల్గొనే భారత జట్టు కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈనెల మూడో వారంలో బీసీసీఐ తమ టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరో ఐదు నెలల్లోనే టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న నేపథ్యంలో ఆ మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకుని కూడా తాజా జట్టును ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. అయితే టెస్టు, వన్డేల మాదిరి కాకుండా టీ20 జట్టులో స్థానం కోసం విపరీత పోటీ నెలకొని ఉంది. అంతేకాకుండా టెస్టు ఫార్మాట్‌లో మాదిరి జట్టు సంధి దశలో కూడా లేదు. మరోవైపు ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టు ఆటగాళ్లలో గిల్‌, బుమ్రా, రాహుల్‌, పంత్‌, సిరాజ్‌ ఆసియాక్‌పలో ఆడే అవకాశం లేదని సమాచారం.

నెంబర్‌ 4లో శ్రేయాస్‌: ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లంతా బెర్త్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా విశేష ప్రతిభ చూపి జట్టును రన్నరప్‌గా నిలిపిన శ్రేయాస్‌ అయ్యర్‌కు ఈసారి పిలుపు ఖాయమేనని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అతడిని టెస్టు, టీ20లకు పక్కనబెట్టి వన్డేల్లో ఆడిస్తున్నారు. కానీ ఐపీఎల్‌లో తను 17 మ్యాచ్‌ల్లో 604 పరుగులు చేసి బ్యాటర్‌గానూ సక్సెస్‌ అయ్యాడు. ఓవరాల్‌గా ఏడాది కాలంలో ఆడిన 25 ఇన్నింగ్స్‌లో 179.73 స్ట్రయిక్‌ రేట్‌తో 949 పరుగులు సాధించాడు. అందుకే పొట్టి ఫార్మాట్‌లో శ్రేయా్‌సను ఎంపిక చేసేందుకు ఈ ప్రదర్శన సరిపోతుందని భావిస్తున్నారు. భారత్‌ తరఫున అతడు 2023లో చివరి టీ20 ఆడాడు. రిషభ్‌ పంత్‌కు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో కీపర్‌గా శాంసన్‌ ఎంపిక లాంఛనమే కానుంది. అయితే ఐపీఎల్‌లో గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ తన ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే శాంసన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాల్సి ఉంటుంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌కు ఈ ఏడాది ఆరంభంలో హెర్నియా సర్జరీ జరిగింది. దీంతో తను ఎన్‌సీఏ పునరావాస శిబిరంలో ఉన్నాడు. తన ఫిట్‌నె్‌సపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ తను కోలుకోలేకపోతే శ్రేయా్‌సకు పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఫినిషర్లుగా ఆల్‌రౌండర్లు హార్దిక్‌, అక్షర్‌ కొనసాగనుండగా కుల్దీప్‌, వరుణ్‌ ప్రధాన స్పిన్నర్లు కానున్నారు. పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌, హర్షిత్‌, ముకేశ్‌ ఉంటారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహించిన సిరాజ్‌కు విండీ్‌సతో సిరీస్‌ కోసం తాజాగా ఉంచే అవకాశం ఉంది.

ఆసియాకప్‌ జట్టు (అంచనా): సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌, శాంసన్‌, తిలక్‌ వర్మ, శ్రేయాస్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, ఇషాన్‌.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 03:13 AM