కెప్టెన్సీ అంటే ఇష్టం శ్రేయాస్
ABN, Publish Date - Jun 10 , 2025 | 05:04 AM
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ తమ జట్టును ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేర్చడంతో పాటు బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. దీంతో...
న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ తమ జట్టును ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేర్చడంతో పాటు బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. దీంతో అతడిని భవిష్యత్ భారత వన్డే కెప్టెన్‌గానూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు అయ్యర్ సైతం జట్టును ముందుండి నడిపించడాన్ని ఆస్వాదిస్తానని అంటున్నాడు. ‘కెప్టెన్సీ అనేది మనలో పరిణతిని, బాధ్యతను తెలియజేస్తుంది. నేను 22 ఏళ్ల నుంచే వివిధ జట్లకు సారథ్యం వహిస్తున్నా. అందుకే సారథ్య బాధ్యతలు అందుకునేందుకు సరిపడా అనుభవం నాకుందనే భావిస్తా’ అని 30 ఏళ్ల శ్రేయాస్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి
లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 10 , 2025 | 05:04 AM