ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suruchi Singh: పసిడి పట్టేసింది

ABN, Publish Date - Jun 14 , 2025 | 06:45 AM

భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌ మరోసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల ఈ హరియాణా స్టార్‌ ఈ ఏడాది వరుసగా మూడోసారి ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌క్‌పలో వ్యక్తిగత స్వర్ణం కొల్లగొట్టింది.

  • షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో సురుచి సంచలనం

మ్యూనిచ్‌ (జర్మనీ): భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌ మరోసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల ఈ హరియాణా స్టార్‌ ఈ ఏడాది వరుసగా మూడోసారి ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌క్‌పలో వ్యక్తిగత స్వర్ణం కొల్లగొట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి చాంపియన్‌గా నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ రన్నరప్‌, ఫ్రాన్స్‌ షూటర్‌ కామిల్లె (241.7) రజతానికి, చైనాకు చెందిన యావో కియాన్‌గ్జువాన్‌ (221.7) కాంస్యానికి పరిమితమయ్యారు. ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో భారత్‌కిదే తొలి పసిడి పతకం. ఇప్పటికే అంజుమ్‌, సిఫ్ట్‌ కౌర్‌ కాంస్యాలు నెగ్గారు. ఇక.. ఈ ఏడాది ఆరంభంలో బ్యూనస్‌ ఎయిర్స్‌, లిమా వేదికల్లో జరిగిన వరల్డ్‌ కప్‌లలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో సురుచి రెండు స్వర్ణాలు నెగ్గిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 14 , 2025 | 06:47 AM