డోపింగ్‌లో పట్టుబడ్డ శివ్‌పాల్
ABN, Publish Date - May 21 , 2025 | 03:34 AM
ఒలింపిక్ జావెలిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ (29) రెండోసారి డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ఒకవేళ అతడు డోపీగా నిర్ధారణ అయితే గరిష్ఠంగా ఎనిమిదేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది...
ఎనిమిదేళ్ల నిషేధం?
న్యూఢిల్లీ: ఒలింపిక్ జావెలిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ (29) రెండోసారి డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ఒకవేళ అతడు డోపీగా నిర్ధారణ అయితే గరిష్ఠంగా ఎనిమిదేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సింగ్ బరిలోకి దిగాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో అవుటాఫ్ కాంపిటీషన్‌లో సేకరించిన మూత్రం శాంపిల్‌లో నిషేధిత ఉత్ర్పేరక ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో అతడిపై తాత్కాలికంగా నిషేధం విధించారు. 2019లో దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో రజతం సాధించడం శివ్‌పాల్ అత్యుత్తమ ప్రదర్శన. 2021లో కూడా సింగ్ డోపింగ్‌లో పట్టుబడడంతో నిషేధం విధించారు.
Updated Date - May 21 , 2025 | 03:34 AM