Shama Mohamed: ఒక ఆట ఆడుకొంటున్నారు..
ABN, Publish Date - Mar 10 , 2025 | 05:53 PM
Shama Mohamed: దుబాయిలో భారత్ జట్టు చాంపియన్ ట్రోపీ 2025 గెలుచుకుంది. దీంతో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షమా మహమ్మద్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. భారత్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మతోపాటు జట్టులో విజయానికి కృషి చేసిన ఆటగాళ్లకు ఆమె అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 10: దుబాయి వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ - 2025 విజేతగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు విజయం సాధించింది. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బాడీపై తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్.. ఈ విజయంపై సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. చారిత్రాత్మక విజయంపై రోహిత్‌తోపాటు అతని బృందాన్ని షమా అభినందనలు తెలిపారు. ఈ ట్రోఫీ గెలుపొందడంలో భారత్ జట్టు అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిందన్నారు. ఈ సందర్భంగా భారత్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఇటీవల భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బాడీతోపాటు ఆయన ఫిట్‌నెస్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
Also Read: పండగ వేళ శ్మశానంలో..
మరి ముఖ్యంగా రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ చేసిన విమర్శలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇంకా చెప్పాలంటే.. రోహిత్ బాడీ షేమింగ్‌ను లక్ష్యంగా చేస్తుకొని .. షమా మహమ్మద్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ అందరి నోళ్లు మూయించినట్లు అయింది. మరి ముఖ్యంగా ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహ్మమద్‌ను పరోక్షంగా జవాబు చెప్పినట్లు అయింది. అదేవిధంగా విజయంలో కీలక పాత్ర పోషించి 76 పరుగులు చేసిన రోహిత్ శర్మకు హ్యాట్స్ ఆఫ్ చెప్పింది.ఇకమిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ని నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్‌ని ఆమె అభినందించింది.
Also Read: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..
ఇటీవల రోహిత్ శర్మ ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఇంత ఫ్యాట్‌గా ఉంటాడా! ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉంది! టీమిండియా కెప్టెన్లలో అత్యంత ఆకట్టుకోలేకపోయినా కెప్టెన్ రోహిత్ శర్మనే" అంటూ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై షమా మహమ్మద్ బాడీ షేమింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షమా మహమ్మద్ వ్యాఖలపై బీజేపీ స్పందించింది. ఆమెను లక్ష్యంగా చేసుకునొ సోషల్ మీడియలో పోస్టులు పెట్టింది. అలాగే బీసీసీఐ సైతం స్పందించింది. ఇక రోహిత్ శర్మపై గతంలో అలా.. తాజా విజయం అనంతరం షమా మహమ్మద్ ఇలా స్పందించడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై ట్రోలింగ్‌కు తెర తీశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మహమ్మద్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకొంటున్నారు.
Also Read: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి
దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో టీమిండియా తన సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను 251 పరుగులకే టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించారు. వికెట్ పడకుండా ఆడుతూ టీమిండియా స్కోర్‌ను పెంచారు. రోహిత్ 76, శ్రేయాస్ 48, రాహుల్ 34 పరుగులు చేయడంతో భారత్ 49ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
మరిన్ని క్రీడా, రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 10 , 2025 | 05:55 PM