కోహ్లీ 18 కానీ సచిన్ 22
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:34 AM
సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్‌కప్ నిరీక్షణతో పోలిస్తే ఐపీఎల్ ట్రోఫీ కోసం విరాట్ కోహ్లీ ఎదురు చూసింది తక్కువేనని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు....
వీరేంద్ర సెహ్వాగ్
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్‌కప్ నిరీక్షణతో పోలిస్తే ఐపీఎల్ ట్రోఫీ కోసం విరాట్ కోహ్లీ ఎదురు చూసింది తక్కువేనని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ ట్రోఫీ కోసం కోహ్లీ 18 ఏళ్లు ఎదురు చూస్తే, వన్డే వరల్డ్‌కప్ కోసం సచిన్ 1989 నుంచి 2011 (22 ఏళ్లు) వరకు నిరీక్షించాల్సి వచ్చిందని అన్నాడు. సచిన్ సుదీర్ఘకాలం వేచి చూశాడే కానీ ఎప్పుడు తన నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పాడు. ‘డబ్బులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ ట్రోఫీలు సాధించడం సులువు కా దు. మొత్తానికి కోహ్లీ నిరీక్షణ కూడా ఫలించింది. ఆర్‌సీబీ ట్రోఫీ సాధించడంలో కోహ్లీ పాత్ర విలువైనది. ఇక తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఐపీఎల్‌నుంచి ఆనందంగా తప్పుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 06 , 2025 | 04:34 AM