సాత్విక్ జంటకు ‘ఖేల్‌రత్న’ ప్రదానం
ABN, Publish Date - May 02 , 2025 | 02:15 AM
బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ ఎట్టకేలకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును అందుకొంది. గురువారం కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ...
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ ఎట్టకేలకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును అందుకొంది. గురువారం కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ..ఈ అవార్డును ప్రదానం చేశారు. 2023లో ప్రదర్శనకు గాను గతేడాది సాత్విక్ జంటను ఖేల్‌రత్నకు ఎంపిక చేశారు. గత ఫిబ్రవరిలో అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని షెడ్యూల్ చేయగా.. ఇందు కోసం వెళ్తున్న సమయంలో సాత్విక్ తండ్రి కాశీ విశ్వనాథం గుండెపోటుతో మరణించడంతో వాయిదా పడింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 02 , 2025 | 02:16 AM