సతీశ్ సంచలనం
ABN, Publish Date - May 22 , 2025 | 03:55 AM
భారత యువ షట్లర్ సతీశ్ కరుణాకరణ్ మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించాడు. సింగిల్స్ ఆరంభ రౌండ్లో సతీశ్ 21-13, 21-14తో ప్రపంచ ఏడో ర్యాంకర్, మూడోసీడ్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)కు షాకిచ్చాడు....
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్
ఫ మూడోసీడ్‌కు షాకిచ్చి రెండోరౌండ్‌కు
ఫ ప్రణయ్, శ్రీకాంత్ ముందుకు.. సింధు ఇంటికి
కౌలాలంపూర్: భారత యువ షట్లర్ సతీశ్ కరుణాకరణ్ మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించాడు. సింగిల్స్ ఆరంభ రౌండ్లో సతీశ్ 21-13, 21-14తో ప్రపంచ ఏడో ర్యాంకర్, మూడోసీడ్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)కు షాకిచ్చాడు. మిగతా భారత షట్లర్లలో సీనియర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేయగా.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆరంభ రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రణయ్ 19-21, 21-17, 21-16తో ఐదోసీడ్ కెంటా నిషిమొటో (జపాన్)పై, శ్రీకాంత్ 23-21, 13-21, 21-11తో లూ గువాంగ్ (చైనా)పై, ఆయుష్ షెట్టి 20-22, 21-10, 21-8తో బ్రయాన్ (కెనడా)పై గెలిచి రెండోరౌండ్ చేరారు. రజావత్ 15-21, 17-21తో హెంగ్ (సింగపూర్) చేతిలో ఓడాడు. పేలవఫామ్‌ను కొనసాగిస్తున్న సింధు 11-21, 21-14, 15-21తో గుయెన్ తుయ్ లిన్ (వియత్నాం) చేతిలో ఓడగా.. మరో ముగ్గురు మహిళా షట్లర్లు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక కూడా పరాజయాలతో నిష్క్రమించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల/తనీషా జోడీ 21-18, 15-21, 21-14తో ఇండోనేసియా జంట అద్నాన్/ఇన్‌దాపై నెగ్గగా.. మిగతా భారత జోడీల్లో అషిత్ సూర్య/అమృత ప్రముతేష్, రోహన్/రుత్వికా శివాని, సతీశ్/ఆద్య మిక్స్‌డ్‌లో తమ పోరును ఆదిలోనే ముగించారు.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 22 , 2025 | 03:56 AM