Sanju Samson: రాజస్థాన్‌ను వీడనున్న శాంసన్
ABN, Publish Date - Aug 08 , 2025 | 03:01 AM
మేనేజ్‌మెంట్‌తో తీవ్ర విభేదాల నేపథ్యంలో కెప్టెన్ సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడడానికి సిద్ధమయ్యాడని సమాచారం. తనను ట్రేడ్ లేదా వేలంలోపాల్గొనేందుకు రిలీజ్ చేయమని...
న్యూఢిల్లీ: మేనేజ్‌మెంట్‌తో తీవ్ర విభేదాల నేపథ్యంలో కెప్టెన్ సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడడానికి సిద్ధమయ్యాడని సమాచారం. తనను ట్రేడ్ లేదా వేలంలోపాల్గొనేందుకు రిలీజ్ చేయమని ఫ్రాంచైజీని సంజూ కోరాడట. అతడు రాజస్థాన్ జట్టులో కొనసాగడానికి ఇష్టపడడం లేదని శాంసన్ కుటుంబ సభ్యులు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. 2025 మెగా వేలానికి ముందు శాంసన్‌ను రాజస్థాన్ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకొంది. 2021 నుంచి ఐపీఎల్‌లో రాయల్స్ తరఫున సంజూ 149 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, ట్రేడింగ్‌లో శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 03:01 AM