ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూడ్‌ అవుట్‌

ABN, Publish Date - May 29 , 2025 | 03:26 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండుసార్లు రన్నరప్‌, 7వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ రెండో రౌండ్‌లోనే ఓడాడు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్కారజ్‌, 8వ సీడ్‌ ముసేటి, మహిళల్లో 4వ సీడ్‌ పౌలిని, 5వ సీడ్‌ స్వియటెక్‌...

మూడో రౌండ్‌లో అల్కారజ్‌, స్వియటెక్‌, స్విటోలినా

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండుసార్లు రన్నరప్‌, 7వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ రెండో రౌండ్‌లోనే ఓడాడు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్కారజ్‌, 8వ సీడ్‌ ముసేటి, మహిళల్లో 4వ సీడ్‌ పౌలిని, 5వ సీడ్‌ స్వియటెక్‌, 13వ సీడ్‌ ఎలెనా స్విటోలినా మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో పోర్చుగల్‌కు చెందిన అన్‌సీడెడ్‌ నునో బోర్గెస్‌ 2-6, 6-4, 6-1, 6-0తో రూడ్‌ను ఇంటిబాట పట్టించాడు. అల్కారజ్‌ 6-1, 4-6, 6-1, 6-2తో ఫాబియన్‌పై, ముసేటి 6-4, 6-0, 6-4తో గాలన్‌పై గెలిచారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లలో పౌలిని 6-3, 6-3తో టోమ్‌జనోవిక్‌ని, నిరుటి విజేత స్వియటెక్‌ 6-1, 6-2తో ఎమ్మా రదుకానుని, 8వ సీడ్‌ జెంగ్‌ 6-2, 6-3తో అరాంగోని, స్విటోలినా 7-6 (4), 7-5తో అనా బోండర్‌ని ఓడించారు.


డబుల్స్‌లో బోపన్న, భాంబ్రీ బోణీ

రొహన్‌ బోపన్న, యుకీ భాంబ్రీ జోడీలు పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాయి. తొలిరౌండ్‌లో భాంభ్రీ/గాలోవే (అమెరికా) ద్వయం 6-3, 6-7 (10), 6-3తో హాస్‌/ జెబె న్స్‌ జంటపై నెగ్గింది. బోపన్న/ఆడమ పల్సెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 7-6(6), 5-7, 6-1తో కాష్‌/ట్రేసీ ద్వయంపై విజయంతో రెండో రౌండ్‌కు చేరింది. రిత్విక్‌ బొల్లిపల్లి/ నికొలాస్‌ (కొలంబియా) జంట మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలైంది.


ఇవీ చదవండి:

హీరోలను మించిన లుక్‌లో రాహుల్!

కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 03:00 PM