ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముంబై హ్యాట్రిక్‌

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:17 AM

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 నాటౌట్‌) ఎట్టకేలకు సత్తా చాటుకున్నాడు. అలాగే పసలేని...

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X గుజరాత్‌

వేదిక : కోల్‌కతా, రా.7.30 నుంచి

  • వరుసగా మూడో విజయం

  • ఫామ్‌ చాటుకున్న రోహిత్‌

  • చెలరేగిన సూర్యకుమార్‌

  • చెన్నై ఖాతాలో ఆరో ఓటమి

ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 నాటౌట్‌) ఎట్టకేలకు సత్తా చాటుకున్నాడు. అలాగే పసలేని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ను సూర్యకుమార్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్‌) కూడా చెడుగుడు ఆడడంతో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ సేన 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆరంభ ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క గెలుపే దక్కించుకున్న ముంబైకి హ్యాట్రిక్‌ విజయం దక్కడం విశేషం. అలాగే సీఎ్‌సకేపై వరుసగా నాలుగు ఓటముల తర్వాత ముంబై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు సాధించింది. జడేజా (35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌), దూబే (32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలు సాధించగా, 17 ఏళ్ల ఆయుష్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 15.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 177 పరుగులు చేసి నెగ్గింది. జడేజాకు ఓ వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు.


అజేయ శతక భాగస్వామ్యంతో: ఓ మాదిరి ఛేదనలో ముంబై జోరు ఎక్కడా తగ్గలేదు. మంచు ప్రభావం కూడా ఉండడంతో వేగంగా పరుగులు వచ్చాయి. గత ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 82 రన్స్‌ మాత్రమే చేసిన ఓపెనర్‌ రోహిత్‌ చెన్నై పేలవ బౌలింగ్‌పై ఫామ్‌ అందుకున్నాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడగా జట్టు పది పరుగుల రన్‌రేట్‌తో సాగింది. మూడో ఓవర్‌లో 6,4,4తో తను 14 రన్స్‌ అందించాడు. మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (24) కూడా ధాటిని కనబర్చడంతో పవర్‌ప్లేలో జట్టు 56 పరుగులు సాధించింది. అయితే తొలి వికెట్‌కు 63 పరుగులు జత చేరాక రికెల్టన్‌ను జడేజా అవుట్‌ చేశాడు. చెన్నైకి దక్కింది ఈ ఒక్క వికెట్టే. ఆ తర్వాత రోహిత్‌కు సూర్య అండగా నిలవడంతో సీఎ్‌సకే బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. 33 బంతుల్లో రోహిత్‌ ఈ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఇక స్పిన్నర్లు జడేజా, నూర్‌ అహ్మద్‌లను లక్ష్యం చేసుకున్న సూర్య బౌండరీలతో చెలరేగాడు. నూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగిన అతడు.. నూర్‌ తర్వాతి ఓవర్‌లోనూ 4,6తో భారీగా పరుగులు రాబట్టాడు. ఈ ధాటికి 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని కూడా పూర్తి చేశాడు. మరోవైపు 30 బంతుల్లో 20 రన్స్‌ కావాల్సిన వేళ, 16వ ఓవర్‌లోనే మూడు సిక్సర్లతో సూర్య మ్యాచ్‌ను ముగించాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 114 రన్స్‌ అందించింది.


ఆదుకున్న జడేజా-దూబే: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ నిదానంగా ఆరంభమైంది. ముంబై పేసర్లు చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు తోడు ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా ఉండడంతో సీఎ్‌సకేకు పరుగులు రావడమే కష్టమై పోయింది. ఓపెనర్లు రచిన్‌ (5), రషీద్‌ (19) సింగిల్స్‌కే పరిమితమయ్యారు. తొలి మూడు ఓవర్లలో 16 పరుగులే రాగా.. ఇందులో పది డాట్‌ బాల్స్‌ ఉండడం గమనార్హం. చివరకు 18వ బంతికి చెన్నై తొలి ఫోర్‌ కొట్టగలిగింది. ఇక నాలుగో ఓవర్‌ తొలి బంతికే రచిన్‌ను పేసర్‌ అశ్వని అవుట్‌ చేశాడు. అయితే నిస్సారంగా సాగుతున్న వీరి ఇన్నింగ్స్‌కు 17 ఏళ్ల ఆయుష్‌ మాత్రే ఊపు తెచ్చాడు. తొలి ఐపీఎల్‌ అయినా ‘సొంత వేదిక’పై చెలరేగాడు. నాలుగో ఓవర్‌లోనే 4,6,6తో 18 రన్స్‌ రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 48/1 స్కోరుతో నిలువగలిగింది. కానీ ఏడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాక మాత్రేను పేసర్‌ చాహర్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే రషీద్‌ స్టంప్‌ అయ్యాడు. ఇక ఆ తర్వాత జడేజా-దూబే పూర్తి రక్షణాత్మకంగా ఆడడంతో 8-11 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా రాకపోగా కేవలం 14 పరుగులే సమకూరాయి. ఆ తర్వాత దూబే బ్యాట్‌ ఝుళిపించడంతో చెన్నై కాస్త కోలుకుంది. హార్దిక్‌ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు బౌల్ట్‌ ఓవర్‌లో 4,6తో జట్టు స్కోరును వంద దాటించాడు. ఇక 16వ ఓవర్‌లో జడేజా 4,6 దూబే 6,6తో 24 పరుగులు రాగా... అటు దూబే 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే 17వ ఓవర్‌లో బుమ్రా మూడు పరుగులే ఇచ్చి ఓ స్లో డెలివరీతో దూబేకు ఝలకిచ్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ధోనీ (4) నిరాశపర్చగా.. ఆఖరి ఓవర్‌లో జడేజా 6,4తో 16 రన్స్‌ రాబట్టి స్కోరును 170 దాటించాడు. అలాగే తను 34 బంతుల్లో అజేయ అర్ధసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.


స్కోరుబోర్డు

చెన్నై: రషీద్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) శాంట్నర్‌ 19, రచిన్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని కుమార్‌ 5, ఆయుష్‌ మాత్రె (సి) శాంట్నర్‌ (బి) చాహర్‌ 32, జడేజా (నాటౌట్‌) 53, శివమ్‌ దూబే (సి) జాక్స్‌ (బి) బుమ్రా 50, ధోనీ (సి) తిలక్‌ (బి) బుమ్రా 4, ఓవర్టన్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 176/5; వికెట్ల పతనం: 1-16, 2-57, 3-63, 4-142, 5-156; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-32-1, బౌల్ట్‌ 4-0-43-0, అశ్వని కుమార్‌ 2-0-42-1, శాంట్నర్‌ 3-0-14-1, బుమ్రా 4-0-25-2, విల్‌ జాక్స్‌ 1-0-4-0, హార్దిక్‌ 2-0-13-0.

ముంబై: రికెల్టన్‌ (సి) మాత్రె (బి) జడేజా 24, రోహిత్‌ (నాటౌట్‌) 76, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 68, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 15.4 ఓవర్లలో 177/1; వికెట్‌ పతనం: 1-63; బౌలింగ్‌: ఖలీల్‌ 2-0-24-0, ఓవర్టన్‌ 2-0-29-0, అశ్విన్‌ 4-0-25-0, జడేజా 3-0-28-1, నూర్‌ 3-0-36-0, పతిరన 1.4-0-34-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 7 5 2 0 10 0.984

ఢిల్లీ 7 5 2 0 10 0.589

బెంగళూరు 8 5 3 0 10 0.472

పంజాబ్‌ 8 5 3 0 10 0.177

లఖ్‌నవూ 8 5 3 0 10 0.088

ముంబై 8 4 4 0 8 0.483

కోల్‌కతా 7 3 4 0 6 0.547

రాజస్థాన్‌ 8 2 6 0 4 -0.633

హైదరాబాద్‌ 7 2 5 0 4 -1.217

చెన్నై 8 2 6 0 4 -1.392

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

1

చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడి (17 ఏళ్లు)గా ఆయుష్‌ మాత్రే.

2

ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు (6786) సాధించిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. కోహ్లీ (8326) టాప్‌లో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 03:17 AM