ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Abraham Benjamin de Villiers: రోహిత్‌ రిటైర్‌ కానవసరంలేదు!

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:20 AM

వన్డేల నుంచి రోహిత్‌ శర్మ రిటైర్‌ కావాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం డివిల్లీర్స్‌ తేల్చి చెప్పాడు.

న్యూఢిల్లీ: వన్డేల నుంచి రోహిత్‌ శర్మ రిటైర్‌ కావాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం డివిల్లీర్స్‌ తేల్చి చెప్పాడు. క్రికెట్‌ చరిత్రలో..వన్డేలలో గొప్ప కెప్టెన్‌గా నిలవగలిగే సత్తా రోహిత్‌కు ఉందని పేర్కొన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్‌ వీడ్కోలు పలుకుతాడని వార్తలొచ్చిన విషయం విదితమే. అయితే తాను వన్డేలనుంచి వైదొలగడంలేదని చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ విజయానంతరం భారత కెప్టెన్‌ స్పష్టంజేశాడు. ‘మిగతా సారథులతో పోలిస్తే కెప్టెన్‌గా రోహిత్‌ విజయాల శాతం (74) ఎంతో మెరుగ్గా ఉంది. ఇది గతంలో ఏ సారథికీ లేదు. అతడు ఇలాగే సాగితే వన్డేలలో అన్ని తరాలకు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలవడం ఖాయం’ అని తన యూట్యూబ్‌ చానెల్‌లో డివిల్లీర్స్‌ అభిప్రాయపడ్డాడు.

Updated Date - Mar 15 , 2025 | 01:20 AM