పంత్‌కు రూ 30 లక్షల జరిమానా
ABN, Publish Date - May 29 , 2025 | 03:23 AM
బెంగళూరుతో మ్యాచ్‌లో లఖ్‌నవూ స్లో ఓవర్‌రేట్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 30 లక్షల జరిమానా పడింది. మిగిలిన జట్టు సభ్యులకు...
లఖ్‌నవూ: బెంగళూరుతో మ్యాచ్‌లో లఖ్‌నవూ స్లో ఓవర్‌రేట్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 30 లక్షల జరిమానా పడింది. మిగిలిన జట్టు సభ్యులకు రూ. 12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ లీగ్‌లో కోడ్‌ను ఉల్లంఘించడం లఖ్‌నవూకిది మూడోసారి. అందుకే, భారీగా జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు.
ఆలా చేయడం బౌలర్‌ను అవమానించినట్టే!
పంత్ విత్‌డ్రా నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్
న్యూఢిల్లీ: లఖ్‌నవూతో మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు జితేశ్ శర్మ రనౌట్ అప్పీల్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారీ ఛేదనలో జితేశ్ పవర్ హిట్టింగ్‌తో బెంగళూరు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే, 17వ ఓవర్‌లో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ.. నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న జితేశ్‌ను రనౌట్ చేశాడు. థర్డ్ అంపైర్ రీప్లేను పరిశీలిస్తుండగానే.. లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ అప్పీలును విరమించుకున్నాడు. దీన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ తప్పుబట్టాడు. ‘థర్డ్ అంపైర్ వద్దకు చేరినప్పుడు నిర్ణయం కోసం వేచి చూడాలి. అంతేకానీ, మధ్యలో తన బౌలర్‌దే తప్పన్నట్టుగా పంత్ అప్పీలును వెనక్కితీసుకోవడమంటే, బౌలర్‌ను అమానించినట్టేన’ని అశ్విన్ అన్నాడు.
ఇవీ చదవండి:
హీరోలను మించిన లుక్‌లో రాహుల్!
కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 30 , 2025 | 02:58 PM