రింకూ పెళ్లి వాయిదా
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:02 AM
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం వాయిదా పడింది. వీరిద్దరికి ఈనెల 8న లఖ్‌నవూలో....
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం వాయిదా పడింది. వీరిద్దరికి ఈనెల 8న లఖ్‌నవూలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబరు 19న పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది. వివాహ వేడుకల కోసం ఇప్పటికే వారణాసిలోని తాజ్ హోటల్‌ను కూడా బుక్ చేశారు. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలిసింది. నవంబరులో రింకూ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉండడమే ఇందుకు కారణమట. వీరి పెళ్లి వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. కాగా, ఈ నవంబరులో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 25 , 2025 | 01:02 AM