ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజస్థాన్‌కు ఓదార్పు విజయం

ABN, Publish Date - May 21 , 2025 | 03:49 AM

అన్ని విభాగాల్లోనూ రాణించిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ సీజన్‌ను విజయంతో ముగించింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు...

నేటి మ్యాచ్‌

ముంబై X ఢిల్లీ

వేదిక : ముంబై, రా.7.30, నుంచి

చెలరేగిన వైభవ్‌.. 6 వికెట్ల తేడాతో ఓడిన చెన్నై

న్యూఢిల్లీ: అన్ని విభాగాల్లోనూ రాణించిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ సీజన్‌ను విజయంతో ముగించింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ రెండు జట్లు ఇదివరకే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అటు సీఎ్‌సకేకిది పదో ఓటమి కావడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్‌ మాత్రే (43), బ్రెవిస్‌ (42) దూబే (39) రాణించారు. మధ్వల్‌, యుధ్‌వీర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి నెగ్గింది. శాంసన్‌ (41), జైస్వాల్‌ (36), జురెల్‌ (31 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఆకాశ్‌ మధ్వల్‌ నిలిచాడు.


టాపార్డర్‌ అదుర్స్‌: ఓ మాదిరి ఛేదనలో ఓపెనర్‌ జైస్వాల్‌ ఆరంభంలో మెరుపులు మెరిపించగా.. ఆ తర్వాత మరో ఓపెనర్‌ వైభవ్‌ జోరు చూపాడు. కెప్టెన్‌ శాంసన్‌ తన సహజశైలిలో ఆడాడు. దీంతో ఆర్‌ఆర్‌ సునాయాసంగా ఛేదనను ముగించింది. జైస్వాల్‌ను పేసర్‌ అన్షుల్‌ బౌల్డ్‌ చేసినా పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 56/1తో నిలిచింది. ఇక వైభవ్‌ బ్యాట్‌కు పనిచెప్పడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయింది. ఈ సమయంలో శాంసన్‌తో పాటు వైభవ్‌ను 14వ ఓవర్‌లో అశ్విన్‌ అవుట్‌ చేయగా, పరాగ్‌ (3)ను నూర్‌ వెనక్కి పం పాడు. దీంతో మ్యాచ్‌లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే జురెల్‌ భారీ షాట్లతో చెలరేగి 17 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


మాత్రే, బ్రెవిస్‌ మెరుపులు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తొలి ఎనిమిది ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయింది. అయితే ఓపెనర్‌ ఆయుష్‌ మాత్రేతో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో బ్రెవిస్‌ విజృంభించాడు. కానీ డెత్‌ ఓవర్లలో తడబాటుతో స్కోరు 200 సమీపంలోనే నిలిచింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ కాన్వే (10), హిట్టర్‌ ఉర్విల్‌ (0)లను పేసర్‌ యుధ్‌వీర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మాత్రే రాజస్థాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మఫాక చక్కటి క్యాచ్‌తో అతడి దూకుడుకు పేసర్‌ తుషార్‌ తెరదించాడు. అప్పటికి మూడో వికెట్‌కు అశ్విన్‌ (13)తో కలిసి 56 పరుగులు జత చేయగా, పవర్‌ప్లేలో జట్టు 68/3 స్కోరుతో నిలిచింది. అనంతరం వరుస ఓవర్లలో అశ్విన్‌, జడేజా (1) వికెట్లను కోల్పోవడంతో సీఎ్‌సకే తడబడినట్టు కనిపించింది. కానీ బ్రెవిస్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. పదో ఓవర్‌లో అతడి 4,6తో స్కోరు కూడా వంద దాటింది. యుధ్‌వీర్‌ ఓవర్‌లోనూ సిక్సర్‌తో చక్కటి జోరు మీదున్న అతడిని పేసర్‌ మధ్వల్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు దూబేతో కలిసి జత చేసిన 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ధోనీ (16) 14వ ఓవర్‌లోనే అడుగుపెట్టినా, క్రీజులో అప్పటికే దూబే ఉన్నప్పటికీ పరుగుల్లో వేగం కనిపించలేదు. చివరి మూడు ఓవర్లలో పేసర్లు తుషార్‌, మధ్వల్‌ అద్భుత బౌలింగ్‌ కారణంగా 17 పరుగులే వచ్చాయి. దీనికి తోడు ఆఖరి ఓవర్‌లో దూబే, ధోనీ వికెట్లను కూడా కోల్పోవడంతో స్కోరు 190లోపే ఆగింది.


స్కోరుబోర్డు

చెన్నై: ఆయుష్‌ మాత్రే (సి) మఫాక (బి) దేశ్‌పాండే 43; కాన్వే (సి) పరాగ్‌ (బి) యుధ్‌వీర్‌ 10; ఉర్విల్‌ (సి) మఫాక (బి) యుధ్‌వీర్‌ 0; అశ్విన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హసరంగ 13; జడేజా (సి)ధ్రువ్‌ జురెల్‌ (బి) యుధ్‌వీర్‌ 1; బ్రెవిస్‌ (బి) ఆకాశ్‌ మధ్వల్‌ 42; శివమ్‌ (సి) జైస్వాల్‌ (బి) మధ్వల్‌ 39; ధోనీ (సి) దేశ్‌పాండే (బి) మధ్వల్‌ 16; అన్షుల్‌ కాంబోజ్‌ (నాటౌట్‌) 5; నూర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 187/8. వికెట్ల పతనం: 1-12, 2-12, 3-68, 4-70, 5-78, 6-137, 7-180, 8-185; బౌలింగ్‌: దేశ్‌పాండే 4-0-33-1; యుధ్‌వీర్‌ 4-0-47-3; మఫాక 2-0-22-0; హసరంగ 4-0-27-1; రియాన్‌ పరాగ్‌ 2-0-26-0; ఆకాశ్‌ మధ్వల్‌ 4-0-29-3.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (బి) కాంబోజ్‌ 36, సూర్యవంశీ (సి) జడేజా (బి) అశ్విన్‌ 57, సంజూ (సి) బ్రెవిస్‌ (బి) అశ్విన్‌ 41, పరాగ్‌ (బి) నూర్‌ 3, జురెల్‌ (నాటౌట్‌) 31, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 12, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం: 17.1 ఓవర్లలో 188/4, వికెట్లపతనం: 1-37, 2-135, 3-138, 4-158; బౌలింగ్‌: ఖలీల్‌ 3-0-35-0, కాంబోజ్‌ 3-0-21-1, అశ్విన్‌ 4-0-41-2, నూర్‌ అహ్మద్‌ 3-0-42-1, పతిరణ 2.1-0-22-0, జడేజా 2-0-27-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 12 9 3 0 18 0.795

బెంగళూరు 12 8 3 1 17 0.482

పంజాబ్‌ 12 8 3 1 17 0.389

ముంబై 12 7 5 0 14 1.156

ఢిల్లీ 12 6 5 1 13 0.260

కోల్‌కతా 13 5 6 2 12 0.193

లఖ్‌నవూ 12 5 7 0 10 -0.506

హైదరాబాద్‌ 12 4 7 1 9 -1.005

రాజస్థాన్‌ 14 4 10 0 8 -0.549

చెన్నై 13 3 10 0 6 -1.030

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 03:49 AM