ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంజాబ్‌ అదుర్స్‌

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:07 AM

పంజాబ్‌ కింగ్స్‌ నుంచి మరో అదిరిపోయే ప్రదర్శన. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఆ జట్టు బౌలర్లు వంద పరుగుల్లోపే కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో నేహల్‌ వధేరా...

నేటి మ్యాచ్‌లు

గుజరాత్‌ X ఢిల్లీ

వేదిక: అహ్మదాబాద్‌ మ.3.30 నుంచి

రాజస్థాన్‌ X లఖ్‌నవూ

వేదిక: జైపూర్‌, రా.7.30 నుంచి

సొంతగడ్డపై బెంగళూరుకు హ్యాట్రిక్‌ ఓటమి

బెంగళూరు: పంజాబ్‌ కింగ్స్‌ నుంచి మరో అదిరిపోయే ప్రదర్శన. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఆ జట్టు బౌలర్లు వంద పరుగుల్లోపే కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో నేహల్‌ వధేరా (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ లోస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అటు తమ సొంత మైదానంలో బెంగళూరుకిది హ్యాట్రిక్‌ ఓటమి. అంతకుముందు సాయంత్రం నుంచే వర్షం కురవడంతో నిర్ణీత సమయానికి టాస్‌ వీలు పడలేదు. అంతకంతకూ వర్షం తీవ్రం కావడంతో మ్యాచ్‌ నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాత్రి తొమ్మిది గంటలకు కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. దీంతో రాత్రి 9.45కు మ్యాచ్‌ ఆరంభమమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 14 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్‌), రజత్‌ పటీదార్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 23) మినహా తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. జాన్సెన్‌, చాహల్‌, హర్‌ప్రీత్‌, అర్ష్‌దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా టిమ్‌ డేవిడ్‌ నిలిచాడు.


నేహల్‌ అండతో..: స్వల్ప ఛేదనే అయినా పంజాబ్‌ కూడా తడబడింది. బెంగళూరులా టపటపా వికెట్లు కోల్పోకున్నా.. పరుగులు మాత్రం అంత సులువుగా రాలేదు. చివర్లో నేహల్‌ వధేరా అండగా నిలిచి జట్టును గట్టెక్కించాడు. ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య (16), ప్రభ్‌సిమ్రన్‌ (13) మాత్రం ఉన్న కాసేపే అయినా జోరు ప్రదర్శించారు. తొలి వికెట్‌కు 22 పరుగులు జోడించాక మూడో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ను భువీ అవుట్‌ చేశాడు. హాజెల్‌వుడ్‌ తన వరుస ఓవర్లలో ప్రియాన్ష్‌, శ్రేయాస్‌ (7)లతో పాటు కుదురుకున్న ఇన్‌గ్లి్‌స (14)ను అవుట్‌ చేయడంతో పంజాబ్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే ఆరంభంలో ఇబ్బందిపడిన నేహల్‌ ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. తొమ్మిదో ఓవర్‌లో 4,6తో 10 రన్స్‌ సాధించగా.. హాజెల్‌వుడ్‌ తన చివరి ఓవర్‌లో రెండు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఈ దశలో నేహల్‌ 11వ ఓవర్‌లో 6,4తో పాటు బైస్‌ రూపంలో బౌండరీ రావడంతో 15 రన్స్‌ సమకూరాయి. అయినా 18 బంతుల్లో 17 రావాల్సి ఉండడంతో ఈ పిచ్‌పై ఏమైనా జరగవచ్చని అంతా అంచనా వేశారు. పైగా 12వ ఓవర్‌లో శశాంక్‌ (1)ను భువీ అవుట్‌ చేసి బెంగళూరులో కాస్త జోష్‌ నింపాడు. కానీ వధేరా అదే ఓవర్‌ ఆఖరి రెండు బంతులను 6,4గా మలిచి సమీకరణం 12 బంతులు 5 పరుగులకు మార్చడంతో ఫలితం అర్థమైంది. అటు స్టొయినిస్‌ (7 నాటౌట్‌) సిక్సర్‌తో 11 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


డేవిడ్‌ ఒక్కడే..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఏడో నెంబర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ ఆటతీరు మినహా చెప్పుకోవడానికేమీ లేదు. అతనొక్కడే 50 పరుగులు చేయగా.. మిగిలిన జట్టు చేసింది 45 పరుగులే కావడం గమనార్హం. కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలిన బ్యాటర్లు పంజాబ్‌ బౌలర్ల జోరుకు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. పిచ్‌ స్లోగా మారినా భారీ స్కోరు ప్రత్యర్థి ముందుంచాలనే ఆలోచనతో షాట్లకు వెళ్లడం దెబ్బతీసింది. అటు పంజాబ్‌ ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లతో ఆకట్టుకున్నారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (4)ను అవుట్‌ చేసిన పేసర్‌ అర్ష్‌దీప్‌, తన తర్వాతి ఓవర్‌లోనే విరాట్‌ కోహ్లీ (1) పనిబట్టాడు. ఇక ఆ తర్వాత బౌలర్లు జాన్సెన్‌, చాహల్‌ కట్టడి చేయడంతో 42/7 స్కోరుతో బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి తొమ్మిది ఓవర్లు కూడా పూర్తి కాలేదు. ఈ స్థితిలో జట్టుకు టిమ్‌ డేవిడ్‌ ఆపద్బాంధవుడయ్యాడు. భువనేశ్వర్‌ (8)తో ఎనిమిదో వికెట్‌కు 21 పరుగులు జోడించాడు. ఇక, చివరిదైన 14వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో జట్టు స్కోరును 90 దాటించిన డేవిడ్‌.. 26 బంతుల్లో అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అలాగే హాజెల్‌వుడ్‌ (0 నాటౌట్‌)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 32 పరుగులు జోడించాడు.


స్కోరుబోర్డు

బెంగళూరు: సాల్ట్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) అర్ష్‌దీప్‌ 4, కోహ్లీ (సి) జాన్సెన్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, పటీదార్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) చాహల్‌ 23, లివింగ్‌స్టోన్‌ (సి) ఆర్య (బి) బార్ట్‌లెట్‌ 4, జితేశ్‌ (సి) వధేరా (బి) చాహల్‌ 2, క్రునాల్‌ (సి అండ్‌ బి) జాన్సెన్‌ 1, టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 50, మనోజ్‌ భండగె (ఎల్బీ) జాన్సెన్‌ 1, భువనేశ్వర్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) హర్‌ప్రీత్‌ 8, యశ్‌ దయాల్‌ (ఎల్బీ) హర్‌ప్రీత్‌ 0, హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 14 ఓవర్లలో 95/9; వికెట్ల పతనం: 1-4, 2-21, 3-26, 4-32, 5-33, 6-41, 7-42, 8-63, 9-63; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-23-2, బార్ట్‌లెట్‌ 3-0-26-1, జాన్సెన్‌ 3-0-10-2, చాహల్‌ 3-0-11-2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-25-2.


పంజాబ్‌: ప్రియాన్ష్‌ ఆర్య (సి) డేవిడ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 16, ప్రభ్‌సిమ్రన్‌ (సి) డేవిడ్‌ (బి) భువనేశ్వర్‌ 13, శ్రేయాస్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 7, ఇంగ్లిస్‌ (సి) సుయాశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 14, నేహల్‌ వధేరా (నాటౌట్‌) 33, శశాంక్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 1, స్టొయినిస్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 12.1 ఓవర్లలో 98/5; వికెట్ల పతనం: 1-22, 2-32, 3-52, 4-53, 5-81; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-26-2, యశ్‌ 2.1-0-18-0, హాజెల్‌వుడ్‌ 3-0-14-3, క్రునాల్‌ 1-0-10-0, సుయాశ్‌ 3-0-25-0.

1

నాలుగేళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో టిమ్‌ డేవిడ్‌ హాఫ్‌ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి.

1

ఒకే వేదికపై ఎక్కువ మ్యాచ్‌లు (బెంగళూరులో 46) ఓడిన జట్టుగా ఆర్‌సీబీ.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 04:07 AM