సీఏసీ చైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓఝా
ABN, Publish Date - Jun 30 , 2025 | 04:34 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఎలాంటి రసాభాస లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో...
హెచ్‌సీఏ ఏజీఎం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఎలాంటి రసాభాస లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏజీఎంలో హెచ్‌సీఏ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చైర్మన్‌గా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా పేరును మెజారిటీ సభ్యులు ప్రతిపాదించడంతో అతడి నియామకం లాంఛనం కానుంది. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు అధ్యక్షతన డిస్ట్రిక్ క్రికెట్ డెవల్‌పమెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. హెచ్‌సీఏ లీగ్స్ నిర్వహణ కూడా అసోసియేషన్‌లోని లీగ్ కమిటీనే పర్యవేక్షించేలా త్వరలో చైర్మన్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ ఏడాది తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్ నిర్వహణకు ఐదుగురు సభ్యులతో గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మించేందుకు జిల్లాకో 25 ఎకరాల భూమి హెచ్‌సీఏకు ప్రభుత్వం సబ్సిడీ ధరకు ఇచ్చేలా సంఘంలో సభ్యులుగా ఉన్న ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘురామ్ రెడ్డి కృషి చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్ కోరారు. ఈ సమావేశంలో మాజీ క్రికెటర్లు అజరుద్దీన్, వెంకటపతి రాజు, హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 30 , 2025 | 04:34 AM