సిక్స్ కొట్టి కుప్పకూలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 04:13 AM
క్రికెట్ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో ఆటగాడు మరణించిన విషాద ఘటన ఆదివారం ఇక్కడ చోటు చేసుకుంది. స్థానిక డీఏవీ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో...
క్రికెటర్ హఠాన్మరణం
ఫిరోజ్‌పూర్ (పంజాబ్): క్రికెట్ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో ఆటగాడు మరణించిన విషాద ఘటన ఆదివారం ఇక్కడ చోటు చేసుకుంది. స్థానిక డీఏవీ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో హర్జిత్ సింగ్ అనే ఆటగాడు సిక్సర్ కొట్టాడు. అనంతరం మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌తో మాట్లాడేందుకు పిచ్ మధ్యలోకి వెళ్లాడు. అక్కడ మోకాళ్లపై కొన్ని క్షణాలు కూర్చొని ఎడమవైపు ఒరిగిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న హర్జిత్‌కు సీపీఆర్ చేసి రక్షించేందుకు సహచర క్రికెటర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హర్జిత్ గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 30 , 2025 | 04:13 AM