పంత్ తనలో తను
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:55 AM
రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలతో చెలరేగిన పంత్ నాలుగో రోజు ఆరంభంలో రిస్కీ షాట్లకు వెళ్లలేదు. పొరపాటున అనవసర షాట్లకు వెళ్లినా.. వెంటనే ప్రశాంతంగా...
రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలతో చెలరేగిన పంత్ నాలుగో రోజు ఆరంభంలో రిస్కీ షాట్లకు వెళ్లలేదు. పొరపాటున అనవసర షాట్లకు వెళ్లినా.. వెంటనే ప్రశాంతంగా ఉండేందుకు తనలో తను మాట్లాడుకోగా అవి స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ‘ఆ షాట్ అవసరం లేదు.. ఒకవేళ బంతిని బాదాలనుకుంటే స్ట్రెయిట్‌గా ఆడు.. ఎందుకంత జబర్ద్‌స్తగా ప్రయత్నిస్తున్నావు’ అంటూ పంత్ తనను తాను సంభాళించుకున్నాడు. అయితే, పంత్ హిందీలో అన్న ఈ మాటలు కామెంటేటర్ మైకేల్ అథర్టన్‌కు అర్థం కాలేదు. దీంతో అతని కోరిక మేరకు దినేశ్ కార్తీక్.. పంత్ వ్యాఖ్యలను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి వినిపించాడు.
1
భారత టెస్టు చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఐదు శతకాలు నమోదవడం ఇదే తొలిసారి.
ఇవీ చదవండి:
దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 04:55 AM