Rishabh Pant Helps: పేద విద్యార్థినికి పంత్ సాయం
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:54 AM
పేద విద్యార్థినికి సాయం చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకొన్నాడు. కర్ణాటకలోని బెళగావికి చెందిన జ్యోతి అనే విద్యార్థిని డిగ్రీ కాలేజీలో చేరడానికి ఆర్థిక సాయం చేశాడు...
న్యూఢిల్లీ: పేద విద్యార్థినికి సాయం చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకొన్నాడు. కర్ణాటకలోని బెళగావికి చెందిన జ్యోతి అనే విద్యార్థిని డిగ్రీ కాలేజీలో చేరడానికి ఆర్థిక సాయం చేశాడు. జ్యోతి తండ్రి చిన్న టీ కొట్టు నడుపుతున్నాడు. 83 శా తం మార్కులతో ఇంటర్ పాసైన జ్యోతి.. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) డిగ్రీలో చేరాలనుకొంది. కానీ, పేదరికంతో ఫీజు కట్టే పరిస్థితి లేదు. ఈ విషయం ఊళ్లోని ఓ వ్యక్తికి చెప్పడంతో.. అతడు తన మిత్రుడి ద్వారా బాలిక స్థితిని పంత్ దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణం స్పందించిన రిషభ్.. తొలి సెమిస్టర్ ఫీజు రూ.40 వేలను కాలేజీ ఖాతాలో జమచేశాడు. తన చదువుకు సాయం చేసిన పంత్‌కు జ్యోతి కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయం బయటకు రావడంతో పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2025 | 02:54 AM