ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UAE Rejects PSL: పాక్‌కు యూఏఈ షాక్‌

ABN, Publish Date - May 10 , 2025 | 04:58 AM

పాక్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ను ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నట్టు పీసీబీ ప్రకటించింది. యూఏఈ కూడా పీఎస్‌ఎల్‌కు ఆతిథ్యాన్ని నిరాకరించింది.

దుబాయ్‌: భారత్‌తో యుద్ధం ప్రభావం పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్ఎల్‌)పైనా పడింది. స్వదేశీ, విదేశీ క్రికెటర్లు పోటీపడుతున్న ఈ లీగ్‌ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం రాత్రి ప్రకటించింది. దేశ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ ఆదేశాల మేరకు పీఎస్ఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని పీసీబీ తెలిపింది. అయితే, అంతకుముందు ఉదయం.. లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నట్టు పీసీబీ వెల్లడించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశీ క్రికెటర్లు లీగ్‌లో కొనసాగేందుకు విముఖత చూపడం, స్వదేశాలకు తరలించాలని కోరడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు, పీఎ్‌సఎల్‌ మ్యాచ్‌ల ఆతిథ్యానికి యూఏఈ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో ఇండో-పాక్‌ క్రికెట్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పీఎస్ఎల్‌ను నిర్వహిస్తే ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఈసీబీ భావిస్తోందట. పైగా బీసీసీఐతో ఈసీబీకి బలమైన సంబంధాలు ఉండడంతో.. పీఎ్‌సఎల్‌కు నో చెప్పాలని అనుకొంటుందని సమాచారం.

Updated Date - May 10 , 2025 | 05:00 AM