Gold Medal: అంకితకు స్వర్ణం
ABN, Publish Date - Aug 16 , 2025 | 04:49 AM
ఒలింపియన్ అంకితా ధ్యాని అంతర్జాతీయ వేదికపై పతకంతో సత్తా చాటింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో
న్యూఢిల్లీ: ఒలింపియన్ అంకితా ధ్యాని అంతర్జాతీయ వేదికపై పతకంతో సత్తా చాటింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగిన గ్రాండ్‌స్లామ్ అథ్లెటిక్స్ మీట్‌లో మహిళల 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అంకిత స్వర్ణం సాధించింది. ఫైనల్స్‌లో అంకిత 6 నిమిషాల 12.92 సెకన్లలో గమ్యాన్ని అధిగమించి విజేత గా నిలిచింది. ఈ క్రమంలో భారత్ తరఫున గతంలో పారుల్ చౌదరి నెలకొల్పిన 6 నిమిషాల 14.38 సెకన్ల జాతీయ రికార్డును అంకిత బద్ధలు కొట్టింది.
Updated Date - Aug 16 , 2025 | 04:49 AM