ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nitish Reddys Swing: బాగుంది రా మామా

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:15 AM

లార్డ్స్‌ టెస్టులో తెలుగు పదాలు వీనులవిందు చేశాయి. ‘బాగుంది రా మామా.. ’అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి అద్భుత బౌలింగ్‌కు...

లార్డ్స్‌లో నితీశ్‌ ప్రతిభకు గిల్‌ ఫిదా

తెలుగులో అభినందన

లార్డ్స్‌ టెస్టులో తెలుగు పదాలు వీనులవిందు చేశాయి. ‘బాగుంది రా మామా.. ’అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి అద్భుత బౌలింగ్‌కు ఫిదా అయిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అతడిని తెలుగులో ప్రశంసించడం అందరినీ ఆకట్టుకుంది. తొలి సెషన్‌లోనే ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనన్లు బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలేలను నితీశ్‌ ఒకే ఓవర్‌లో అవుట్‌ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. దీంతో నితీశ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో నితీశ్‌ వేసిన బంతి అద్భుతంగా స్వింగ్‌ అయినప్పుడు స్లిప్స్‌లో ఉన్న సారథి గిల్‌.. ‘వాట్‌ రా రెడ్డి.. బాగుంది రా మామా’ అని తెలుగులో పొగడడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది గిల్‌ గొంతు కాదని, బహుశా కరుణ్‌ నాయర్‌ది అయివుండవచ్చునని అంటున్నారు. నాయర్‌ తెలుగు బాగా మాట్లాడుతాడని కొందరు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 02:15 AM