ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Biggest Test Wins: కివీలు కుమ్మేశారు

ABN, Publish Date - Aug 10 , 2025 | 05:59 AM

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో...

రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 రన్స్‌తో జింబాబ్వే చిత్తు

అరంగేట్ర పేసర్‌ జకారికి ఐదు వికెట్లు ఫ 2-0తో క్లీన్‌స్వీ్‌ప

బులవాయో: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీ్‌సను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అంతేకాకుండా ఓవరాల్‌ టెస్టు చరిత్రలోనూ ఇది మూడో భారీ విజయం కావడం విశేషం. కివీస్‌ జట్టులో 23 ఏళ్ల అరంగేట్ర పేసర్‌ జకారి ఫౌల్కెస్‌ సంచలన ప్రదర్శనతో (5/37) అబ్బురపరిచాడు. ఫలితంగా జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే కుప్పకూలింది. నిక్‌ వెల్చ్‌ (47 నాటౌట్‌), కెప్టెన్‌ ఇర్విన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెన్రీ, డఫీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కాన్వే, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హెన్రీ నిలిచారు.

తొలి సెషన్‌లోనే..: ఓవర్‌నైట్‌ స్కోరు 601/3 పరుగుల వద్దే కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో ఆ జట్టుకు 476 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక శనివారం ఉదయమే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే తొలి సెషన్‌లోనే కుప్పకూలింది. పేసర్ల ధాటికి కేవలం 28.1 ఓవర్లే ఆడింది. ఓపెనర్‌ బెన్నెట్‌ను ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే పేసర్‌ హెన్రీ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత డఫీ, ఫిషర్‌ల ధాటికి జింబాబ్వే 49/4 స్కోరుతో నిలిచింది. ఇక 16వ ఓవర్‌ నుంచి వరుస విరామాల్లో ఐదు వికెట్లను పడగొట్టిన పేసర్‌ జకారి మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్ల భరతం పట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌: 125

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/3 డిక్లేర్‌;

జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌: 28.1 ఓవర్లలో 117 ఆలౌట్‌ (వెల్చ్‌ 47 నాటౌట్‌, ఇర్విన్‌ 17; ఫౌల్కెస్‌ 5/37, హెన్రీ 2/16, డఫీ 2/28).

టెస్టు క్రికెట్‌లో భారీ విజయాలు

ఇన్నింగ్స్‌ 579 రన్స్‌తో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌

ఇన్నింగ్స్‌ 360 రన్స్‌తో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా

ఇన్నింగ్స్‌ 359 రన్స్‌తో జింబాబ్వేపై న్యూజిలాండ్‌

ఇన్నింగ్స్‌ 336 రన్స్‌తో భారత్‌పై వెస్టిండీస్‌

1

న్యూజిలాండ్‌ తరఫున అరంగేట్ర టెస్టులో ఉత్తమ గణాంకాలు (9/75) నమోదు చేసిన బౌలర్‌గా నిలిచిన ఫౌల్కెస్‌. విల్‌ ఓరౌర్కీ (9/93)ని దాటాడు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 06:00 AM