BCCI RTI Exemption: ఆర్‌టీఐ నుంచి తప్పించుకొన్న బీసీసీఐ
ABN, Publish Date - Aug 07 , 2025 | 03:06 AM
నూతన క్రీడా బిల్లు ద్వారా బీసీసీఐకు భారీ ఊరట లభించింది. క్రీడా మంత్రిత్వశాఖ చేసిన సవరణల ప్రకారం బీసీసీఐ.. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పరిధిలోకి రాదు. దీంతో బయట వ్యక్తులు డిమాండ్ చేసే....
న్యూఢిల్లీ: నూతన క్రీడా బిల్లు ద్వారా బీసీసీఐకు భారీ ఊరట లభించింది. క్రీడా మంత్రిత్వశాఖ చేసిన సవరణల ప్రకారం బీసీసీఐ.. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పరిధిలోకి రాదు. దీంతో బయట వ్యక్తులు డిమాండ్ చేసే వివరాలను వెల్లడించాల్సిన పనిలేదు. ఈ నెల 23న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టిన జాతీయ క్రీడా పాలన బిల్లులోని క్లాజ్ 15(2) ప్రకారం.. ప్రభుత్వం నుంచి నిధులు, సదుపాయాలు అందుకొంటున్న జాతీయ క్రీడా సమాఖ్యలు మాత్రమే ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయని స్పష్టంగా ఉంది. అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐ.. నిధుల కోసం ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారపడదు. సొంతంగానే మైదానాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొంటోంది. మిగతా సమాఖ్యల తరహాలోనే భారత బోర్డును సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నా.. బీసీసీఐ మాత్రం ససేమిరా అంటోంది. కొత్త క్రీడా బిల్లులో ఈ సవరణ బీసీసీఐకు అనుకూలం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2025 | 03:06 AM