రాజస్థాన్..కొత్త కొత్తగా
ABN, Publish Date - Mar 18 , 2025 | 04:27 AM
జట్టులో భారీ మార్పులు.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను తీసుకోవడంతో ఈ సీజన్‌లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ సరికొత్త జోష్‌తో కనిపిస్తోంది. 2008 ఆరంభ లీగ్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్...
ఐపీఎల్
మరో 4 రోజుల్లో
జట్టులో భారీ మార్పులు.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను తీసుకోవడంతో ఈ సీజన్‌లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ సరికొత్త జోష్‌తో కనిపిస్తోంది. 2008 ఆరంభ లీగ్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్.. సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది ఫైనల్‌కు చేరినా కప్‌ను ముద్దాడలేక పోయింది. అయితే, ఈసారి నిలకడైన ప్రదర్శనతో టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. సంజూ శాంసన్ మరోసారి జట్టును నడిపించనుండగా.. ద్రవిడ్ సూచనలు వారికి అదనపు బలం కానున్నాయి. శాంసన్‌తోపాటు యశస్వీ జైస్వాల్, హెట్‌మయర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కోర్ టీమ్. జోష్ బట్లర్, అశ్విన్, యజ్వేంద్ర చాహల్‌ను వదిలేసుకొన్న రాయల్స్.. ఆశ్చర్యకర రీతిలో జోఫ్రా ఆర్చర్, నితీశ్ రాణాను వేలంలో కొనుగోలు చేసింది. ఓవరాల్‌గా చూస్తే జట్టులో సమతుల్యం కనిపిస్తోంది. హసరంగ, మహీష్ తీక్షణ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకొన్నా.. అతడు ఈ సీజన్‌లో ఆడడం కష్టమే. కానీ, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యువరక్తం ఎక్కించడానికి ఫ్రాంచైజీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. రాయల్స్ ప్రధాన బలం టాపార్డర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అనుభవం, దూకుడైన ఆటతో జైస్వాల్, సంజూ ఓపెనర్లుగా రాణిస్తుండగా.. రాణా వన్‌డౌన్‌లో ఆడే అవకాశం ఉంది. ఇక, మిడిలార్డర్‌లో పరాగ్, హెట్‌మయర్, జురెల్, శుభమ్ దూబే కీలకం కానున్నారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన పరాగ్.. మరోసారి అదే తరహా జోరు కొనసాగించాలని ఫ్రాంచైజీ కోరుకొంటోంది. రాజస్థాన్ బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, సందీప్ శర్మ, ఫజల్ ఫరూకీ ఏదశలోనైనా వికెట్లు పడగొట్టగల సమర్థులు. అయితే, వీరు డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేక పోవడం ఆందోళన కలిగించే అంశం.
రాజస్థాన్ రాయల్స్
బ్యాటర్లు: జైస్వాల్, హెట్‌మయర్, రియాన్ పరాగ్, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ.
వికెట్ కీపర్లు: శాంసన్ (కెప్టెన్), జురెల్, కునాల్ సింగ్ రాథోడ్;
ఆల్‌రౌండర్లు: రాణా, హసరంగ, యుద్ధ్‌వీర్ సింగ్;
బౌలర్లు: సందీప్ శర్మ, ఆర్చర్, ఫజల్, క్వీనా మపాక, మహీశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వాల్, అశోక్ శర్మ.
Read Also : Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..
Updated Date - Mar 18 , 2025 | 04:27 AM