ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వన్డే రూల్స్‌ మారుతున్నాయ్‌

ABN, Publish Date - Jun 02 , 2025 | 03:29 AM

వచ్చే నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో పలు నిబంధనలు మారనున్నాయి. వన్డేల్లో ప్రస్తుతం ఉన్న రెండు బంతుల నిబంధనపై విమర్శలు రావడంతో ఐసీసీ మార్పులు చేసింది...

  • 35వ ఓవర్‌ నుంచి ఒక్క బంతే

  • ఐసీసీ నిర్ణయం

దుబాయ్‌: వచ్చే నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో పలు నిబంధనలు మారనున్నాయి. వన్డేల్లో ప్రస్తుతం ఉన్న రెండు బంతుల నిబంధనపై విమర్శలు రావడంతో ఐసీసీ మార్పులు చేసింది. ఇప్పటి పద్దతిలో బంతి రివర్స్‌ స్వింగ్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో బౌలర్లకు ప్రయోజనం లభించడం లేదని సచిన్‌ కూడా కొన్నేళ్ల క్రితం కామెంట్‌ చేశాడు. తాజాగా మార్చిన రూల్‌ ప్రకారం.. మ్యాచ్‌లో 34వ ఓవర్‌ వరకు రెండు వైపుల నుంచీ కొత్త బంతులనే వినియోగిస్తారు. 35వ ఓవర్‌ నుంచి మాత్రం.. అంతకు ముందు వాడిన రెండు బంతుల్లో ఒకదాన్నే ఫీల్డింగ్‌ జట్టు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బంతితోనే మిగతా మ్యాచ్‌ను పూర్తి చేయాలి’ అని ఐసీసీ పేర్కొంది. ఈ కారణంగా డెత్‌ ఓవర్లలో బంతి పాతబడి రివర్స్‌ స్వింగ్‌కు చాన్సుంటుంది. అలాగే కంకషన్‌ రూల్‌లో మార్పులు చేశారు. ఇక నుంచి మ్యాచ్‌కు ముందే రెఫరీకి ఐదుగురు పేర్లతో కూడిన కంకషన్‌ రీప్లే్‌సమెంట్‌ జాబితాను అందించాలి. ఇందులో ఒక కీపర్‌, బ్యాటర్‌, పేసర్‌, స్పిన్నర్‌, ఆల్‌రౌండర్‌ ఉండాలి. అలాగే బౌండరీ లైన్‌ క్యాచ్‌లు, డీఆర్‌ఎస్‌పైనా మార్పుల గురించి త్వరలోనే ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. ఈనెల 17నుంచి సవరించిన మార్పులు అమల్లోకి రానున్నాయి.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:29 AM