ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Athletics: నీరజ్‌కు రెండోస్థానం

ABN, Publish Date - May 24 , 2025 | 02:03 AM

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పోలండ్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో రెండో స్థానం దక్కించుకున్నాడు. 84.14 మీటర్లతో అతను అద్భుత ప్రదర్శన చూపించాడు.

హాజో (పోలెండ్‌): ఇటీవల దోహా డైమండ్‌ లీగ్‌లో 90 మీటర్ల దూరాన్ని అధిగమించి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా.. తన తదుపరి ఈవెంట్‌లోనూ సత్తా చాటాడు. ఓర్లెన్‌ జానుజ్‌ కుసోన్సిస్కీ మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన పోటీలో నీరజ్‌ రెండోస్థానంలో నిలిచాడు. నీరజ్‌ జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరాడు. మొదటి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన చోప్రా, రెండో ప్రయత్నంలో 81.28 మీటర్లు విసిరాడు. తర్వాత రెండు ఫౌల్స్‌ చేసిన నీరజ్‌ ఐదో యత్నంలో 81.80 మీటర్లు, ఆ తర్వాత చివరగా 84.14 మీటర్లతో సరిపెట్టుకున్నాడు. దోహా డైమండ్‌ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జర్మనీ స్టార్‌ జులియన్‌ వెబర్‌ ఇక్కడా అదేజోరు చూపి ప్రథమస్థానం దక్కించుకున్నాడు. 86.12 మీటర్లతో వెబర్‌ టాప్‌లో నిలవగా.. పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా) 83.24 మీటర్లతో మూడోస్థానానికి పరిమితమయ్యాడు.

Updated Date - May 24 , 2025 | 02:05 AM