నీరజ్‌కు మళ్లీ టాప్ ర్యాంక్
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:59 AM
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొన్నాడు. శనివారం విడుదల చేసిన తాజా ర్యాంక్‌ల జాబితాలో నీరజ్ మొత్తం...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొన్నాడు. శనివారం విడుదల చేసిన తాజా ర్యాంక్‌ల జాబితాలో నీరజ్ మొత్తం 1445 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. గతేడాది సెప్టెంబరులో చోప్రాను వెనక్కినెట్టి గ్రెనడా త్రోయర్ అండర్సన్ పీటర్స్ టాప్ ర్యాంక్‌ను అందుకొన్నాడు. కానీ, ఆ తర్వాత నిలకడగా రాణిస్తున్న చోప్రా ఇటీవలే వరుసగా పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ ఈవెంట్లు గెలిచాడు. దీంతో మళ్లీ నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. అండర్సన్ (1431) రెండో ర్యాంక్‌కు పడిపోగా, జులియన్ వెబెర్ (జర్మనీ, 1412) మూడు, పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్థాన్, 1370) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. జాకుబ్ (చెక్, 1366) ఐదో స్థానంతో టాప్-5లో నిలిచాడు.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 03:59 AM