నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
ABN, Publish Date - May 15 , 2025 | 05:15 AM
దేశ ప్రాదేశిక సైన్యంలో సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ.. గెజిట్‌ను విడుదల చేసింది....
న్యూఢిల్లీ: దేశ ప్రాదేశిక సైన్యంలో సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ.. గెజిట్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి దోహాలో డైమండ్ లీగ్ ప్రారంభమవనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం నీరజ్‌లో మరింత స్ఫూర్తి నింపనుంది. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడంతో పాటు క్రీడా రంగంలో నీరజ్ చోప్రా కనబరిచిన విశిష్ట ప్రతిభను గుర్తించి పదోన్నతి కల్పించినట్టు మిలటరీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, మేజర్ జనరల్ జీఎస్ చౌధురి తెలిపారు. 2016లో నయిబ్ సుబేదార్‌గా సైన్యంలో చేరిన నీరజ్, 2021లో విశిష్ట సేవా పతకంతో పాటు సుబేదార్‌గా పదోన్నతి పొందాడు. 2022లో పరమ విశిష్ట సేవా పతకాన్ని అందుకోగా.. గత ఏడాది సుబేదార్ మేజర్‌గా నీరజ్‌కు పదోన్నతి లభించడం తెలిసిందే.
ఓర్లెన్ బరిలో చోప్రా
ఓర్లెన్ జానస్జ్ కుసొసిన్‌స్కీ స్మారక పోటీల్లో నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు. ఈనెల 23 నుంచి జరిగే ఈ పోటీలకు పోలెండ్‌లోని చోర్జెవ్ ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి ఈనెల 24 నుంచి బెంగళూరులో జరిగే ఎన్‌సీ క్లాసిక్ టోర్నమెంట్‌లో నీరజ్ పాల్గొనాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ పోటీలు వాయిదా పడ్డాయి.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్.. అనుష్క ఎమోషనల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 15 , 2025 | 05:15 AM