ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Neeraj Chopra Javelin Record: భళా.. బల్లెం వీరా

ABN, Publish Date - May 17 , 2025 | 02:17 AM

భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా 90.23 మీటర్ల బల్లెం విసురుతో చారిత్రక మైలురాయిని సాధించాడు. డైమండ్‌ లీగ్‌ పోటీలో జూలియన్‌ వెబర్‌ మొదటి స్థానం దక్కించుకున్నాడు.

  • 90 మీటర్ల మార్క్‌తో నీరజ్‌ చరిత్ర

  • డైమండ్‌ లీగ్‌లో భారత స్టార్‌కు రెండోస్థానం

  • వెబర్‌కు మొదటి స్థానం

90 మీ. మార్క్‌ను చేరుకున్న మూడో ఆసియా అథ్లెట్‌గా నీరజ్‌ రికార్డు నెలకొల్పాడు. అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌, 92.97 మీ.), చావో సున్‌ చెంగ్‌ (తైపీ, 91.36 మీ.) ఇంతకుముందు ఈ మార్క్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా..అంటే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 25వ అథ్లెట్‌గా చోప్రా నిలిచాడు.

దోహా: మన బల్లెం వీరుడు భళా అనిపించాడు.. మరోసారి అసాధారణ ప్రదర్శనతో దేశం ఉప్పొంగేలా చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న తన ‘లక్ష్యాన్ని’ జావెలిన్‌ త్రో స్టార్‌ నీజర్‌ చోప్రా చేరుకున్నాడు. దోహాలో శుక్రవారం జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ టోర్నీలో నీరజ్‌.. మూడో ప్రయత్నంలో ఈటెను 90.23 మీటర్ల దూరం విసిరాడు. అయితే, హోరాహోరీగా సాగిన పోటీలో జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. కాగా.. చాలాకాలంగా 90 మీటర్ల లక్ష్యానికి గురిపెట్టిన నీరజ్‌ ఏకంగా దానిని మించిన దూరంలో ఈటెను విసరడం విశేషం. తొలి ప్రయత్నంలోనే 88.44 మీటర్ల దూరం విసిరిన చోప్రా..ప్రధాన ప్రత్యర్థులు అండర్సన్‌ పీటర్స్‌, జులియన్‌ వెబర్‌లకు అందనంత దూరంలో నిలిచాడు. రెండో రౌండ్‌లో ఫౌల్‌ చేసిన భారత అథ్లెటిక్స్‌ పోస్టర్‌ బాయ్‌ నీరజ్‌ మూడో రౌండ్‌లో ఏకంగా 90.23 మీ.దూరంతో కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇక..నీరజ్‌ గత అత్యుత్తమ దూరం 89.94 మీ. దీనిని 2022 స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో నెలకొల్పాడు. అది జాతీయ రికార్డు కూడా కావడం విశేషం. కాగా..అంతకుముందు ఈ సీజన్‌ అత్యుత్తమ దూరాన్ని (84.52 మీ) నీరజ్‌ తొలి ప్రయత్నం (88.44 మీ.)లోనే అధిగమించాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీ. దూరం విసిరిన 27 ఏళ్ల చోప్రా, ఐదో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. ఆరో, ఆఖరి ప్రయత్నంలో 88.20 మీ. దూరంతో సరిపెట్టుకున్నాడు.


విజేత వెబర్‌: నీరజ్‌కు దోహా అంచె టైటిల్‌ ఖాయమని అనుకున్న దశలో..జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ అనూహ్యంగా దూసుకొచ్చాడు. ఐదో రౌండ్‌లో 89.84 మీ. దూరం విసిరి చోప్రాకు సమీపంలోకి వచ్చిన వెబర్‌..ఆరో రౌండ్‌లో 91.06 మీ. దూరం ఈటెను విసిరి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఈ దూరం వెబర్‌కు వ్యక్తిగత అత్యుత్తమం కూడా. అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా- 85.64 మీ.)కు మూడోస్థానం దక్కింది. ఈ విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్‌ శ్రీకాంత్‌ జెనా ఎనిమిది స్థానంతో నిరాశపరిచాడు.

పారుల్‌..జాతీయ రికార్డ్‌: మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో భారత్‌కు చెందిన పారుల్‌ చౌధురి 9ని13.39 సె. గమ్యం చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే ఈ విభాగంలో ఆమె ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచింది.

Updated Date - May 17 , 2025 | 07:48 AM