Javelin Throw Event: నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ వాయిదా
ABN, Publish Date - May 10 , 2025 | 05:02 AM
ప్రస్తుత పరిస్థితుల కారణంగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ వాయిదా పడింది. బెంగళూరులో ఈనెల 24న జరగాల్సిన ఈ పోటీని కొన్నిరోజుల పాటు వాయిదా వేయాలని నీరజ్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ మాజీ చాంపియన్ నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ నిరవధికంగా వాయిదా పడింది. స్వయంగా నీరజ్ నిర్వహిస్తున్న ఈ జావెలిన్ త్రో మెగా ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న బెంగళూరు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా టోర్నీని కొన్నిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు నీరజ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈవెంట్‌ను ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే వెల్లడిస్తామన్నాడు.
Updated Date - May 10 , 2025 | 05:03 AM